Horoscope Today: ఈ రాశి వారు చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది.. మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Oct 11, 2022 | 6:49 AM

రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాశి ఫలాలు చూసుకొని కార్యక్రమాలను మెదలు పెట్టేవారు, లేదా పనులను వాయిదా వేసుకుంటుంటారు. మరి ఈరోజు (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

Horoscope Today: ఈ రాశి వారు చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది.. మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాశి ఫలాలు చూసుకొని కార్యక్రమాలను మెదలు పెట్టేవారు, లేదా పనులను వాయిదా వేసుకుంటుంటారు. మరి ఈరోజు (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

మేష రాశి..

మేష రాశి వారు మొదలు పెట్టిన పనుల్లో ఎలాంటి అవంతరాలు ఎదురైనా పట్టుదలతో సాధిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ రాశుల వారికి శివారాధన సూచించతగ్గ అంశం.

వృషభ రాశి..

వృషభ రాశి వారికి అలసట పెరిగే అవకాశాల ఉన్నాయి. మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరిచినా, మీ ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు. ఈ రాశివారికి విష్ణు నామస్మరణ సూచించదగ్గ అంశం.

ఇవి కూడా చదవండి

మిథున రాశి..

మిథున రాశి వారికి ఈరోజు ఆశించిన ఫలితాలు సొంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వాటిలో సత్ఫలితాన్ని కూడా పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది. ఈ రాశుల వారు శని శ్లోకాన్ని చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు.

కర్కాటకం..

ఈ రాశి వారి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో సంతోగంగా ఉంటారు. మనోస్థైర్యంగా తగ్గకుండా చూసుకోండి. ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు.

సింహ రాశి..

ఈ రాశి వారు అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లి మంచి ఫలితాలను పొందుతారు. చక్కటి ప్రణాళికతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. సింహ రాశి వారికి లక్ష్మీదేవి సందర్శనం సూచించదగ్గ అంశం.

కన్య రాశి..

ఈ రాశి వారికి ఈ రోజు శారీరక శ్రమ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండండి. బంధువులతో వాదనలకు దూరంగా ఉండడం ఉత్తమం.

తుల రాశి..

చేపట్టి పనుల్లో ఎట్టి పరిస్థితుల్లో పట్టుదలను వదలకండి. స్థిరమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లండి. కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంతత దూరం కాకుండా చూసుకోండి.

వృశ్చిక రాశి..

మంచి భవిష్యత్తు కోసం ప్లానింగ్స్‌ వేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈరోజు జరిగే ఓ సంఘటన మీకు సంతోషాన్ని ఇస్తుంది.

ధనుస్సు రాశి..

మీతోటి వారిని కలుపుకొని పనిచేయాలి అప్పుడు విజయాన్ని అందుకోగలరు. మీ తెలివితోనే మీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం దైవరాదన చేయాలి.

మకర రాశి..

శ్రమకు తగ్గ ఫలితం లభించే అవకాశాలు ఉన్నాయి. అవగాహనలోపం రాకుండా పనులు చక్కదిద్దుకోండి. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుంటారు.

కుంభం..

కుంభ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తారు. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగా ఉంటారు. ఈ రాశివారికి శ్రీరామనామాన్ని జపించడం సూచించదగ్గ అంశం.

మీనం..

మీన రాశి వారు ఈరోజు తోటి వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల సహకారంతో అనుకున్న పనులు చేస్తారు. ఈరోజంతా ఆనందంగా గడుపుతారు. మీన రాశి వారి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయం మంచిది.

నోట్‌: రాశిఫలాలు అనేవి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ అందించడం జరిగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..