Horoscope Today (November 20-11-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి జరుగుతుందా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 21 వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరాశివారు చేపట్టిన పనులను ఆలస్యంగా ప్రారంభిస్తారు. అనవసర భయాందోళనకు గురిఅవుతారు. అల్పభోజనం వలన అనారోగ్యాన్ని పొందుతారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అనుకోని లాభాలను అందుకుంటారు. అనారోగ్యానికి గురవుతారు. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు మనోద్వేగానికి గురవుతారు. కొత్తపనులు వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం మంచిది కాదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా మేలు చేస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొత్తపనులను వాయిదా వేస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూరి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు స్త్రీల వలన లాభం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పాడతాయి. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఇతరుల విమర్శలను ఎదుర్కొంటారు. స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆకస్మికంగా ధన నష్టం ఏర్పడకుండా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధిమించడానికి అధికంగా డబ్బుని ఖర్చు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. బంధు మిత్రులతో కలుస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు స్త్రీలతో తగాదా పెట్టుకుంటారు. చేపట్టిన పనులు నెరవేరతాయి. కొన్ని పనులు వాయిదా చేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి.
మీన రాశి: ఈరోజు ఈరాశి వారు ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఋణలాభం పొందుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి.
Also Read: