Hanuman Jayanti: శనివారం..హనుమాన్ జయంతి..మరింత విశిష్టత.. శనిదోషం నివారణ కోసం ఏ చర్యలను పాటించాలంటే..

|

Apr 11, 2022 | 7:14 PM

Hanuman Jayanti 2022: దేశ వ్యాప్తంగా ఉన్న రామ భక్త హనుమాన్ భక్తులు ప్రతి సంవత్సరం చైత్రమాసం(Chiatramaas) పౌర్ణమి(Pournami) రోజున  హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడు జన్మించాడని..

Hanuman Jayanti: శనివారం..హనుమాన్ జయంతి..మరింత విశిష్టత.. శనిదోషం నివారణ కోసం ఏ చర్యలను పాటించాలంటే..
Hanuman Jayanti 2022
Follow us on

Hanuman Jayanti 2022: దేశ వ్యాప్తంగా ఉన్న రామ భక్త హనుమాన్ భక్తులు ప్రతి సంవత్సరం చైత్రమాసం(Chiatramaas) పౌర్ణమి(Pournami) రోజున  హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడు జన్మించాడని నమ్ముతారు. ఈ  ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 16 న వచ్చింది. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అంతే కాదు దంపతుల మధ్య ఎడబాటు ఉన్నవారు ఒకటవుతారని విశ్వాసం. ఇక పురాణాల కథనం ప్రకారం.. ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో.. వారి వద్దకు శనీశ్వరుడు చేరాడని నమ్మకం. ఈసారి హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రాముఖ్యత పెరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా.. ఎవరైనా శని దోషాన్ని నివారించుకోవడానికి కొన్ని నివారణ చర్యలను పాటించదవచ్చు..

హనుమాన్ జయంతి రోజున చేయాల్సిన పనులు: ఈరోజున హనుమంతుడి ఆలయాన్ని సందర్శించండి. దేవుని ముందు దీపం వెలిగించండి. ఆ రోజు హనుమాన్ దేవాలయంలో 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. దీంతో హనుమంతుడు ప్రసన్నుడయ్యాడని ప్రతీతి. ఇలా చేయడం వల్ల శని దోషం తొలగిపోతుంది.

హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడికి గులాబీల దండను సమర్పించండి. ఈ రోజు 11 రావి ఆకులను తీసుకోండి. వాటిపైన శ్రీరాముని నామం రాయండి. ఈ ఆకులను హనుమంతునికి సమర్పించండి. దీంతో శని దోషాలు తొలగిపోతాయి.

హనుమాన్ జయంతి నాడు.. హనుమంతుడికి తమలపాకులు సమర్పించండి. సుందరకాండ పఠించాలి. శని దోషం తొలగిపోవడానికి హనుమంతుని ముందు ఆవనూనె దీపం వెలిగించండి. అలాగే ఈ దీపంలో 2 లవంగాలు ఉంచండి. ఇప్పుడు ఈ దీపంతో హనుమంతుడిని పూజించండి.

హనుమాన్ జయంతి రోజున.. ఆయన విగ్రహం ముందు కూర్చుని రామాయణం, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. ఈ రోజు హనుమంతునికి సింధూరం,  ఆయిల్ సమర్పించండి.

ఆవు నెయ్యితో చేసిన 5 రొట్టెలను నైవేద్యంగా సమర్పించండి. హనుమంతుడి ఆలయంలో కూర్చుని, ‘ఓం రామదూతాయ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం జపించడం వలన జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.

ఆంజనేయ జయంతి నాడు కొబ్బరికాయ తీసుకుని హనుమాన్ గుడికి వెళ్లండి. మీ తలపై కొబ్బరికాయను ఏడుసార్లు తాకించండి.. అనంతరం ఆ కొబ్బరి కాయను దేవుడి గుడిలో పగలగొట్టండి. ఈ పరిహారం చేయడం వల్ల జీవితంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి.

Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.

Also Read: Governor: యాదాద్రిలో ఏం జరిగిందో.. భద్రాద్రిలోనూ అదే జరిగింది.. గవర్నర్ పట్ల తీరు మారని రాష్ట్ర సర్కార్!