ఈ ఏడాది కార్తీక మాస అమావాస్య అక్టోబర్ 24వ తేదీ, అక్టోబర్ 25వ తేదీ.. రెండు రోజులు వచ్చింది. అయితే 24వ తేదీ సోమవారం దీపావళి పర్వదినం జరుపుకోనున్నారు. మర్నాడు.. అంటే దీపావళి మర్నాడు అక్టోబర్ 25న మన దేశం సహా ప్రపంచంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణాన్ని భారతదేశంలో కొన్ని నగరాల్లో కనిపించనుంది. ఈ గ్రహణం విశ్వంలో అరుదైనది.. ఇటు వంటి గ్రహణం వచ్చే దశాబ్దం వరకు భారతదేశంలో కనిపించదు. ఈ పాక్షిక గ్రహణం.. దేశ రాజధానితో పాటు, జైపూర్, కోల్కతా, ముంబై, చెన్నై, నాగ్పూర్ , ద్వారక తదితర ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సమయంలో, భారతదేశంలోని ప్రజలు సూర్యుని 43 శాతం మాత్రమే చూడగలరు. ఈ గ్రహణాన్ని నేరుగా చూడటం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రహణం ఏ నగరంలో ఏ సమయంలో కనిపిస్తుందంటే:
పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటి?
సూర్యుడు తన కక్ష్యలో కదులుతూనే ఉంటాడు. అయితే సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. మనం సూర్యుడిని చూడలేము. దీనిని సూర్యగ్రహణం అంటారు. పాక్షిక సూర్యగ్రహణం అంటే చంద్రుడు కొన్ని సూర్య కిరణాలను భూమిపైకి రాకుండా అడ్డుకున్నప్పుడు దానిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. భారతదేశంలో తదుపరి సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న కనిపించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం.
గ్రహణ సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి
సూర్యగ్రహణం సమయంలో ఆహారాన్ని తినకుండా ఉండాలి. గ్రహణం ప్రభావం వల్ల సూర్యకిరణాలు కలుషితమవుతాయని, మీరు ఉంచిన ఆహారం కూడా విషపూరితం అవుతుందని నమ్మకం.
గ్రహణం తరువాత.. స్నానం చేయాలి, అలాగే ఇంటిని శుభ్రం చేయాలి. మీ ఇంట్లో పూజా స్థలం లేదా దేవాలయం ఉంటే, దానిని కూడా ఖచ్చితంగా శుభ్రం చేయండి. ఇది ఇంటిలోని ప్రతికూలతలను, దోషాలను తొలగిస్తుంది.
సూర్యగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి. అలాగే, గ్రహణ సమయంలో నిద్రపోకుండా ప్రయత్నించండి. అయితే ధ్యానం, జపం చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)