మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి పోతాయి. రుణాలు వసూలు అవుతాయి. దగ్గర వారి నుంచి రావాల్సిన డబ్బు కూడా అందు తుంది. ఆర్థిక ప్రయత్నాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయ త్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు. పిల్లల విషయంలో ఊహించని సమస్య లను ఎదుర్కుంటారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అనవసర వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా కుటుంబ పెద్దలతో
వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ఉద్యోగంలో అధికారులతో వ్యవహారాలన్నీ సామరస్యంగా సాగి పోతాయి. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కానీ, ముఖ్యమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొందరు చిన్ననాటి మిత్రు లను, బంధువులను కలుసుకుంటారు. విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేక మైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అటు
అధికారులను, ఇటు సహోద్యోగులను పని తీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): అవసరానికి తగిన ధన సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు
లభిస్తాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలను, విధులను సక్రమంగా, సమర్థవంతంగా
నిర్వహించి, మంచి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అయి మనశ్శాంతి ఏర్పడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): స్థిరాస్తి విక్రయ వ్యవహారాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహా రాలు వేగంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండా ల్సి న అవసరం ఉంది. బంధుమిత్రుల వల్ల కొన్ని కీలక పనులు సానుకూలపడతాయి. కొత్త ప్రయ త్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా ఆశా జనకంగా ముందుకు సాగుతాయి. కీలక విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుంచి ఆదరపూర్వక ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న వ్యవహా రాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయంలో పెరుగుదల, మెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు మాత్రం అదుపు
లేకుండా పెరిగిపోయే సూచనలున్నాయి. మితిమీరిన ఔదార్యంతో అడిగినవారికల్లా సహాయం చేసే అవ కాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది కానీ, కొందరు సహచరుల విమర్శలు చేసే అవకాశం ఉంది. మిత్రుల అండ లభిస్తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు
అందివస్తాయి. విందు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి సంతృప్తిని కలిగిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): చాలావరకు మంచే జరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. సానుకూల
దృక్పథంతో వ్యవహరించడం అవసరం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడ ఉంటుంది కానీ దైవకార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంటా బయటా ప్రశాంతంగా గౌరవప్రదంగా సాగిపోతుంది. పిల్లల చదువుల మీద ఎక్కువగా శ్రద్ద పెట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి