Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్న..
తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. వైసీపీ MLA, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. తెలంగాణలో..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుటుంబ సభ్యులు. నిన్న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు.. ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. వైసీపీ MLA, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో KCR సతీమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం
Published on: Oct 10, 2023 07:57 AM