సనాతన హిందూ ధర్మంలో గాయత్రీ మంత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనదని నమ్మడమే కాక ఇప్పటికీ తమ పిల్లలతో పఠిస్తుంటారు వైదికులు. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితమంతా సంతోషం ఉంటుందని నమ్ముతారు హిందువులు. మొదటిసారిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఈ గాయత్రీ మంత్రం.. సంస్కృతంలో లిఖించి ఉంటుంది. ఇక గాయత్రీ మంత్రలోని “వ్యాహృతులు” అనేవి దివ్యశక్తిని కలిగి ఉంటాయి. ఇవి 3 కాలాలను సూచిస్తాయి. ఇంకా గాయత్రి మంత్రంలో 24 భీజాక్షరాలు ఉంటాయి. ఈ 24 భీజాక్షరాలను ఆధారం చేసుకొని ఆలయాలను కూడా నిర్మించారు మన పూర్వీకులు. మరి హిందూ ధర్మంలో ఇంతటి మహిమ కలిగిన గాయత్రీ మంత్రం అర్థం, దానిని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పడు తెలుసుకుందాం..
‘ఓం భూర్భువస్సువ:
తత్ సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి,
ధియోయోన: ప్రచోదయాత్’
తాత్పర్యం: ‘మేము దైవిక జీవి, సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము. ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది’. హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం ఈ మంత్రం గాయత్రీ దేవికి అంకితం. ఇంకా గాయత్రీదేవిని వేదాలకు తల్లి అని కూడా అంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ మంత్రాన్ని ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు జపిస్తారు. గాయత్రీ మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ మంత్రాన్ని అన్ని సమయాలలోనూ పఠించవచ్చు.
గాయత్రీ మంత్రం ప్రయోజనాలు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..