Chanakya Niti: నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుందన్న చాణక్య

|

Dec 18, 2021 | 6:56 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు పండితుడు మాత్రమే కాదు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త కూడా.  సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు,..

Chanakya Niti: నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుందన్న చాణక్య
Chanakya Niti
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు పండితుడు మాత్రమే కాదు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త కూడా.  సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. ఈ నీతి శాస్త్రంలో ప్రస్తుత కాలంలో ఉపయోగపడే అనేక విషయాలను గురించి చెప్పాడు. అలాంటి వాటిల్లో ఒకటి మనుషుల మధ్య ఉండే బంధాలు.. ఆ బంధాలను నిలబెట్టుకోవడానికి నడవడిక.. బంధం విడిపోతే మనిషి పడే తపన గురించి ఈరోజు చాణక్య నీతిగా తెలుసుకుందాం..

*భార్య లేదా స్నేహితురాలు నుండి విడిపోయే పరిస్థితి వస్తే ఆ వ్యక్తికి చాలా విచారంగా ఉంటుంది. ఈ పరిస్థితిని తట్టుకోవడం అందరికీ అంత సులభం కాదు.
*ఒక వ్యక్తి .. బంధువు, స్నేహితుడు లేదా ఇతరులచే అవమానింపబడితే ఈ పరిస్థితి చాలా బాధను కలిగిస్తుంది. అలాంటి అవమానం ఆ  వ్యక్తిని లోపల మంటలా దహించివేస్తుంది.
* అధిక అప్పులను చేసి..  అతను దానిని తిరిగి చెల్లించలేనప్పుడు.. ఆ వ్యక్తిని ఆ ఇబ్బంది మనస్సుని కలవరానికి గురి చేస్తుంది.
*మంచి వ్యక్తి..దయ లేని యజమానకి లేదా కపట వ్యక్తికీ సేవకుడు అయితే అతను ప్రతి క్షణం ఉక్కిరిబిక్కిరి అవుతాడు.
*ఏ మనిషికైనా పేదరికం చాలా బాధాకరం. డబ్బు లేనప్పుడు, ఒక వ్యక్తి తన ఆనందాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఈ పరిస్థితి ఎవరికైనా బాధాకరమే.
*మంచి స్వభావం ఉన్న వ్యక్తి..  స్వార్థపరుడిని కలిస్తే, అతని పరిస్థితి చాలా విచారకరంగా మారుతుంది. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ వ్యక్తి తనను తాను.. చాలా సార్లు తిట్టుకుంటాడు.

Also Read:  యూపీకి ప్రధాని మోడీ భారీ కానుక.. నేడు గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన.. 2024 నాటికి సిద్ధం