Telugu News Spiritual Chanakya niti according to chanakya women with these habits are considered very lucky
Chanakya Niti: ఈ అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యలుగా పొందిన వ్యక్తులు చాలా అదృష్టవంతులంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో స్త్రీల కొన్ని అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఈ అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యలు పొందిన వ్యక్తులు వ్యక్తికి చాలా అదృష్టవంతులట
ఆచార్య చాణక్యుడు గొప్ప గురువు. తన విధానాల బలంతో.. తెలివి తేటలతో సాధారణ బాలుడైన చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిగా చేశాడు. నేటికీ ఆయన విధానాలను ప్రజలు అనుసరిస్తున్నారు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో విద్య, వ్యాపారం, డబ్బు, ఉద్యోగం సహా మానవ సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలను గురించి చెప్పాడు. ఈ విధానాలు గతంలో మాదిరిగానే నేటికీ అనుసరించదగినవి. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో స్త్రీల కొన్ని అలవాట్ల గురించి కూడా ప్రస్తావించాడు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఈ అలవాట్లు ఉన్న స్త్రీలను భార్యలు పొందిన వ్యక్తులు వ్యక్తికి చాలా అదృష్టవంతులట
కోపం రాని స్త్రీ – కోపమే మనిషికి అతి పెద్ద శత్రువు. ఆచార్య ప్రకారం, కోపం రాని స్త్రీని భార్యలుగా పొందిన వ్యక్తులు అదృష్టవంతులుగా భావిస్తారు. ఇటువంటి స్త్రీ ఇంట్లో శాంతిని కాపాడుతుంది. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
మధురంగా మాట్లాడే స్త్రీ – మధురంగా మాట్లాడి ఎవరి మనసునైనా గెలుచుకోవచ్చు. తియ్యగా మాట్లాడేవాళ్లను చాలామంది ఇష్టపడతారు. స్త్రీ మధురంగా మాట్లాడితే ఆ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. అలాంటి చోట్ల తక్కువగా చర్చ జరుగుతుంది. ప్రశాంతత నెలకొంటుంది.
సహనం – సహనం ఒక వ్యక్తి అతిపెద్ద బలం. సహనం ఉన్న స్త్రీ ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించగలదు. సహనం కలిగిన స్త్రీ ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. పరిస్థితులను చక్కదిద్దుతుంది.
దేవుడిపై నమ్మకం ఉన్న స్త్రీ – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. దేవుడిపై నమ్మకం ఉన్న స్త్రీని కలిగిన భర్త స్త్రీ చాలా అదృష్టవంతుడుగా పరిగణించబడుతున్నాడు. నిత్యం పూజ జరిగే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
తృప్తి కలిగిన స్త్రీ – ఏ స్త్రీ అయితే తమకు ఉన్నదానితో సంతృప్తి చెందుతారో.. అటువంటి స్త్రీని భార్యగా పొందిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎంత ఉన్నా.. తక్కువ అనే అసంతృప్తితో ఉన్న స్త్రీలతో ఎటువంటి వ్యక్తులైనా ఎప్పుడూ ఇబ్బందులను పడుతూ ఉండాల్సిందే.