
జీవతంలో ప్రతీ ఒక్కరికీ సిరిసంపదలు కావాలని కోరుకుంటారు. అందుకే ధనలక్ష్మి కటాక్షం కోరకుండా ఉండేవారు ఎవరూ ఉండరు. మనందరికీ జీవితాన్ని సౌఖ్యంగా, సంపన్నంగా గడపాలన్న ఆశ ఉంటుంది. మన జీవితం సాఫీగా సాగాలంట డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేకుండా సాధారణ జీవితం కూడా కష్టమే. ధనసంపదలకి ప్రధానదేవత లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే, ఆ కుటుంబంలో ధనాభావం ఉండదు. అయితే, లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండరు. మన నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో చేయిపోయే చిన్న తప్పుల వల్ల ధనలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం సాధారణం. అలాగే, ధనలక్ష్మి తిరిగి ఆశీర్వదించేందుకు, ఎలాంటి పరిహారాలు లేదా ఆచారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి రోజు లేదా ప్రతి శుక్రవారం శ్రీసూక్తం పఠించాలి. ఇది సిరిసంపదలను ప్రసాదించే లక్ష్మీ ఆశీర్వాదాన్ని అందిస్తుంది.
ఇంటి తుడిచే నీటిలో కొద్దిగా సముద్ర ఉప్పు కలపాలి. ప్రతికూల శక్తులను తొలగించి ఇంట్లో శాంతిని తీసుకువస్తుంది.
రాగి పాత్రలో నీటిని నింపి తులసి ఆకులు, సువాసన పువ్వులు వేసి ఉంచాలి. లక్ష్మీదేవి ఇల్లు సుఖసంపదలతో కళకళలాడుతుంది.
అమావాస్య రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. అగరుధూపం వెలిగించడం ద్వారా ఇంట్లో శాంతి, శ్రేయస్సు వస్తుంది.
ప్రతి నెల పౌర్ణమి రోజున లక్ష్మీ-గణపతి హోమం జరపాలి.
కుబేర హోమం కూడా సంపద, శాంతి, ఆరోగ్యం కలిగిస్తుంది.
సాయంత్రం, అతిథులకు ఆహారాన్ని అందించి, దక్షిణ తాంబూలాలతో గౌరవించాలి. ఇది ధనలక్ష్మీ కటాక్షం కలిగే మార్గం.
బయట నుంచి వచ్చే సమయంలో వట్టి చేతులతో కాకుండా.. పూలు, పళ్ళు, మిఠాయిలు ఇల్లు తీసుకురావడం అలవాటు చేసుకోవాలి.
ఇంటి ప్రధాన గుమ్మం మీద గుమ్మడికాయ ఉంచడం, కనుదృష్టి గణపతి ఫోటో ఉంచడం ద్వారా సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి.
ఉప్పు గాజు లేదా జాడీ పాత్రలో ఉంచి మూత పెట్టాలి. ధనం పెరగడానికి సహాయపడుతుంది.
తలుపులు, గుమ్మాలు ఎల్లప్పుడూ నూతనంగా, రంగులు సరిగా ఉండేలా చూసుకోవాలి. భయంకర శబ్దాలు ధనలక్ష్మీని దూరం చేస్తాయి.
విద్యాదానం, వస్త్రదానం, జలదానం వంటి దానాలు చేయాలి. ఒకసారి దానం చేసిన తర్వాత దానాన్ని గుర్తుంచకూడదు.
గురువారం, శుక్రవారం గోమాతను పసుపు-కుంకుమలతో పూజించి ఆహారం అందించాలి. ప్రతి శనివారం కుక్కలకు పెరుగన్నం ఇవ్వడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
ప్రతి రోజూ తులసి మొక్కను పూజించాలి. దీపారాధన ద్వారా అదృష్టం, శాంతి, సంపదలు లభిస్తాయి.
ప్రతి శనివారం చెట్టుకు నీరు పోసి, నువ్వుల నూనె లేదా ఆవనూనెతో దీపారాధన చేయాలి. ఐశ్వర్యం, సంపదల ఆటంకాలు తొలగిపోతాయి.
ప్రతి గురువారం అరటి చెట్టుకు నీరు పోసి, చెట్టు క్రింద వెన్న, అరటి నారుతో దీపారాధన చేయాలి. గురుబలం పెరిగి ఆర్థికంగా విజయాన్ని అందిస్తుంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)