దీపావళి పర్వదినాన్ని కొందరు ఐదురోజుల పాటు జరుపుకుంటారు.. ఈ పంచ మహాపర్వ దినం చివరి రోజున అన్నాచెల్లెళ్ల పండగ లేదా భగిని హస్త భోజనంగా జరుపుకుంటారు. అనగా కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున రాఖీ పర్వదినం మాదిరిగానే రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం సూర్యగ్రహణం కారణంగా మూడవ రోజున జరుపుకోనున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. అన్నా చెల్లెల పండగ రోజున, మృత్యుదేవత యముడు తన సోదరి యమున వద్దకు వెళ్లి ఆమె చేతితో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటాడని నమ్మకం. అందుకనే అన్న చెల్లెల బంధానికి గుర్తుగా సోదరీమణులు తమ సోదరులకు హారతి చేస్తారు. తమ అన్నకు దీర్ఘాయువు ఇవ్వమని దేవుడిని ప్రార్థిస్తారు. ఈ సంవత్సరం సూర్యగ్రహణం కారణంగా చాలా పండుగల తేదీల విషయంలో గందరగోళం ఏర్పడింది. సోదరుడి సుదీర్ఘ జీవితానికి, సోదరీమణుల ప్రేమకు సంబంధించిన అన్నా చెల్లెల పండుగను ఎప్పుడు, ఏ సమయంలో జరుపుకోవాలో తెలుసుకుందాం.
అన్నా చెల్లెల పండగ శుభ సమయం
పంచాంగం ప్రకారం.. కార్తీక మాసంలోని కృష్ణ పక్షం రెండవ తేదీ 26 అక్టోబర్ 2022 మధ్యాహ్నం 02:42 నుండి ప్రారంభమై మరుసటి రోజు అంటే 27 అక్టోబర్ 2022 మధ్యాహ్నం 12:42 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయ తిథి ప్రకారం అన్నాచెల్లెళ్ల పండుగను జరుపుకుంటారు. తమ సోదరులకు అక్టోబర్ 27, 2022న మధ్యాహ్నం 12:42 గంటలలోపు తిలకం దిద్ది పూజాధి కార్యక్రమాలను నిర్వహించాలి. పండగకు అనుకూలమైన సమయం 11:07 నుండి 12:46 నిమిషాల వరకు ఉంది.
పూజ విధి
అన్నాచెల్లెళ్ల పండగ రోజున, సోదరుడు, సోదరి ఇద్దరూ సూర్యోదయానికి ముందు స్నానం చేసి ధ్యానం చేయాలి. దీని తరువాత, శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి, ముందుగా, సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి.
అన్నాచెల్లెళ్ల పండుగ రోజున తన సోదరుడికి పూజాదికార్యక్రమాలను నిర్వహించే ముందు కుంకుమను నుదుట పెట్టాలి. సోదరి పూజా పళ్ళెంలో ముందుగానే పువ్వులు, అక్షతలు, స్వీట్లు, కుంకుమ ఏర్పాటు చేసుకోవాలి.
సోదరుడికి కుంకుమ దిద్దే ముందు.. సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు నిలబెట్టి, అతని భుజంపై రుమాలు లేదా ఏదైనా వస్త్రాన్ని ఉంచండి. తన సోదరుడికి కుంకుమ దిద్దే సమయంలో కుడి చేతిని ఉపయోగించాలి.
సోదరీమణులు కుంకుమ పెట్టిన తర్వాత, సోదరులు సోదరీమణుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. అదే సమయంలో తన క్షేమాన్ని కోరుతూ పూజ చేసే సోదరికి అన్న ఖచ్చితంగా ఏదైనా బహుమతి లేదా దక్షిణ ఇవ్వాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)