Telugu News Spiritual Astro tips: do not borrow or give these things to anyone otherwise you will have bad luck in life in telugu
Astro Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ అప్పుగా ఇవ్వొద్దు.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..
మన అదృష్టం కొన్ని వస్తువులతో ముడిపడి ఉందని, మనం ఎవరికైనా ఈ వస్తువులను అప్పుగా ఇస్తే.. మన అదృష్టం కూడా ఆ వస్తువుతో పాటు వెళ్తుందని విశ్వాసం. ఇదే విషయాన్నీ అనేక గ్రంధాలు, పురాణాలలో చెప్పారు కూడా.. కొన్ని రకాల వస్తువులను అప్పుగా తీసుకోవడం లేదా దానం చేయడం ద్వారా వ్యక్తి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
స్నేహితులకు లేదా సన్నిహితులకు లేదా పొరుగువారికి ఇలా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే.. మనం ఆ వస్తువును ఎటువంటి సందేహం లేకుండా వారికి ఇస్తాం. షేర్ చేయడం కేరింగ్ గురించి అందరికీ తెలిసిన సంగతే.. అయితే కొన్నిసార్లు కొన్ని విషయాలను ఇతరులకు పంచడం లేదా ఎవరికైనా దానం చేయడం కూడా హానికరం అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. మన అదృష్టం కొన్ని వస్తువులతో ముడిపడి ఉందని, మనం ఎవరికైనా ఈ వస్తువులను అప్పుగా ఇస్తే.. మన అదృష్టం కూడా ఆ వస్తువుతో పాటు వెళ్తుందని విశ్వాసం. ఇదే విషయాన్నీ అనేక గ్రంధాలు, పురాణాలలో చెప్పారు కూడా.. కొన్ని రకాల వస్తువులను అప్పుగా తీసుకోవడం లేదా దానం చేయడం ద్వారా వ్యక్తి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. స్నేహితుడికి, బంధువుకి లేదా పొరుగువారికి ఇవ్వకూడని వస్తువులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
కలం లేదా పెన్ను: పురాణ గ్రంథాలలో కలం అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. అంతేకాదు కలంతో అనేక పనులు ముడిపడి ఉంటాయి. ఒకరి నుండి పెన్ను ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారా.. వ్యక్తి సంపాదించుకున్న ఫలం కూడా అవతలి వ్యక్తికీ వెళ్తాయని చెబుతారు. అందుకే ఎవరూ తమ పెన్ను అప్పుగా ఇవ్వకూడదు.
చీపురుహిందువుల నమ్మకం ప్రకారం.. లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే చీపురు ఎవరికీ ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
బియ్యంబియ్యం శుక్ర గ్రహానికి సంబంధించినవిగా పరిగణించబడుతున్నాయి. ఎవరికైనా బియ్యం శుక్రవారం దానం చేస్తే శుక్రగ్రహ దోషం వస్తుందని అంటారు. దీని కారణంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్యం , ప్రతికూల శక్తి ఇంట్లో నివసిస్తుందని విశ్వాసం.
బట్టలుశాస్త్రాల ప్రకారం మీరు ధరించే బట్టలు ఎవరికీ ధరించడానికి ఇవ్వకూడదు. బట్టలు శక్తికి సంబంధించినవి, మీరు ఒక వ్యక్తికి బట్టలు ఇస్తే.. అది మీపై ప్రతికూల శక్తిని ప్రభావితం చేస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
దువ్వెనతరచుగా ప్రజలు అవసరమైనప్పుడు ఇతరుల దువ్వెనను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం వేరొకరి దువ్వెనను ఉపయోగించడం వలన మీ అదృష్టం.. దురదృష్టంగా మారుతుంది. అందుకే ఇతరులకు మీ దువ్వెనను ఇవ్వకుండా ఉండడం మంచిది.