Sri Rama Idol: శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో..52 అడుగుల శ్రీరాముడి విగ్రహాం ఏర్పాటు

|

Mar 13, 2022 | 2:06 PM

Sri Rama Idol: కర్నూలు జిల్లా(kurnool District)లోని మంత్రాలయం (Mantralayam) శ్రీ రాఘవేంద్రస్వామి మఠం(Sri Raghavendra Math) ఆధ్వర్యంలో 52 అడుగుల శ్రీరాముడి విగ్రహాం ఏర్పాటుకు శ్రీ మఠం పీఠాధిపతి..

Sri Rama Idol: శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో..52 అడుగుల శ్రీరాముడి విగ్రహాం ఏర్పాటు
Sri Rama Idol
Follow us on

Sri Rama Idol: కర్నూలు జిల్లా(kurnool District)లోని మంత్రాలయం (Mantralayam) శ్రీ రాఘవేంద్రస్వామి మఠం(Sri Raghavendra Math) ఆధ్వర్యంలో 52 అడుగుల శ్రీరాముడి విగ్రహాం ఏర్పాటుకు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామి వారు శ్రీకారం చుట్టారు. గత నెల రోజుల క్రితం అనంతపురం జిల్లా మడకశిర మండలం పిల్లిగుండ్ల గ్రామం నుంచి 156 టైర్ల ప్రత్యేక వాహనంలో బయలుదేరిన రాముడి ఏకశిల విగ్రహం మంత్రాలయం చేరుకుంది. శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామివారు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య రాముడి ఏకశిల ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. భారీ వాహనం కావటంతో మంత్రాలయం వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య లేకుండా మంత్రాలయం పోలీసులు ఏర్పాట్లు చేశారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో 52 అడుగుల శ్రీ రాముడి విగ్రహాం ఏర్పాటు కు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్రతీర్థులు శ్రీకారం చుట్టారు. గత నెల రోజుల క్రితం అనంతపురం జిల్లా మడకశిర మండలం పిల్లిగుండ్ల గ్రామం నుంచి 156 టైర్ల ప్రత్యేక వాహనంలో బయలుదేరిన రాముడి ఏకశిల విగ్రహం శనివారం మంత్రాలయం చేరుకుంది. శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్రతీర్థులు వాహనానికి ప్రత్యేక పూజలు చేపట్టి స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య రాముడి ఏకశిల ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. భారీ వాహానం కావడంతో మంత్రాలయం వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా మంత్రాలయం పోలీసులు, సర్పంచు భీమయ్య ఏర్పాట్లు చేశారు.

 

Also Read:

మంచుకురిసే వేళలో..సైనికుల ఆటవిడుపు.. కబడ్డీ .. కబడ్డీ అంటూ పోటీపడిన జవాన్లు