అదుపులోకి వచ్చిందనుకున్న సమయంలో.. మళ్లీ ఇలా..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అరకోటికి పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇరవై నాలుగు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకోగా.. మరో మూడున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొన్ని దేశాల్లో కరోనా ప్రభావం తగ్గుతుందని అనుకున్న క్రమంలో.. మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చిందనుకున్న సమయంలో.. మళ్లీ ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో […]

అదుపులోకి వచ్చిందనుకున్న సమయంలో.. మళ్లీ ఇలా..
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 6:54 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అరకోటికి పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇరవై నాలుగు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకోగా.. మరో మూడున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కొన్ని దేశాల్లో కరోనా ప్రభావం తగ్గుతుందని అనుకున్న క్రమంలో.. మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చిందనుకున్న సమయంలో.. మళ్లీ ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కలకల రేగింది. తాజాగా.. బుధవారం నాడు కొత్తగా మరో నలభై కేసులు నమోదవ్వడంతో.. స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 36 కేసులు సియోల్ మెట్రో ప్రాంతానికి చెందినవి కావడం గమనార్హం. తాజాగా బుధవారం నాడు నమోదైన కేసులతో కలిపి.. దక్షిణ కొరియా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా బారినపడి 269 మంది ప్రాణాలు కోల్పోయారు.