‘ అది క్రూరమైన దాడి.. మంత్రులేం చేస్తున్నారు.. ? ‘ అసదుద్దీన్ ఒవైసీ

ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ఆ విద్యార్థులపై జరిగింది  ‘ క్రూరమైన దాడి ‘ అని ఆయన  అభివర్ణించారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ధైర్యంగా పోరాడి నిరసన ప్రకటించినందుకు వారిని ‘ శిక్షించేందుకే ‘ ఈ ఎటాక్ జరిగిందని ఒవైసీ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు కూడా బేలగా.. నిస్సహాయంగా ట్వీట్లు చేయడం చాలా దారుణమని అన్నారు. ఇది […]

' అది క్రూరమైన దాడి.. మంత్రులేం చేస్తున్నారు.. ? ' అసదుద్దీన్ ఒవైసీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2020 | 3:08 PM

ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ఆ విద్యార్థులపై జరిగింది  ‘ క్రూరమైన దాడి ‘ అని ఆయన  అభివర్ణించారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ధైర్యంగా పోరాడి నిరసన ప్రకటించినందుకు వారిని ‘ శిక్షించేందుకే ‘ ఈ ఎటాక్ జరిగిందని ఒవైసీ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు కూడా బేలగా.. నిస్సహాయంగా ట్వీట్లు చేయడం చాలా దారుణమని అన్నారు. ఇది చాలా బ్యాడ్ అని వ్యాఖ్యానించారు. గూండాలతో పోలీసులు ఎందుకు చేతులు కలిపారో మోదీ సర్కార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  అటు-జె ఎన్ యు విద్యార్థులకు ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.

కాగా-ఈ విశ్వవిద్యాలయ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. యూనివర్సిటీల క్యాంపస్ లను ‘ రాజకీయ రణరంగాలుగా ‘ మార్చరాదని కోరారు. విద్యా సంస్థలను పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డుగా మారిస్తే విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె అన్నారు.