బస్సులో బుస్ బుస్.. తెలంగాణ పామే మరి..!

snake found in Asifabad Luxury bus

హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న బస్సులో పాము అందరినీ భయపెట్టింది. ప్రయాణికులతో కిక్కిరిసిన లగ్జరీ బస్సులో ఓ పాము కలకలం రేపింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి ఆసిఫాబాద్‌కు వెళుతుండగా బస్సు లోపలికి పాము జొరబడింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పెద్దపల్లి వరకు రాగానే పాము  లోపలోకి ప్రవేశించిందని, దీనికోసం ఎంత వెదికినా కనిపించలేదని దీంతో బయలుదేరిందని తెలిపారు. అయితే ఎంతకీ కనిపించని పాము.. బస్సు డ్రైవర్ సీటు కిందే ఉండటంతో వెంటనే పక్కన నిలిపివేసి స్ధానికుల సహాయంతో బయటకు పంపారు. అయితే స్ధానికులు మాత్రం దాన్ని చంపేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *