Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

Disposable Paper Cups Are Not Safe May Cause Cancer, పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఈ మధ్యకాలంలో చాలామంది రోజుకి మూడుసార్లయినా ఛాయ్ తాగుతుంటారు. ఇక నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్న ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర రాకుండా ఉండటానికి టీ తాగుతూ వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇక ఇంట్లో గానీ.. ఆఫీసులో గానీ ఛాయ్‌ను గాజు గ్లాసుల్లో తాగుతుంటాం. అయితే ఫ్రెండ్స్‌తో బయటికెళ్లినప్పుడు మాత్రం టీను పేపర్ కప్పుల్లో తాగాల్సి ఉంటుంది. ఇక ఇలా పేపర్ కప్పుల్లో టీ తాగడం.. ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. అదేందుకో ఇప్పుడు చూద్దాం…

నిజానికి పేపర్ కప్పులను థర్మాకోల్‌తో తయారు చేస్తారట. కానీ ఈ మధ్య చాలామంది థర్మాకోల్ బదులుగా పాలియస్టర్ అనే ఒక రకమైన ప్లాస్టిక్‌తో ఆ కప్పులను తయారు చేస్తున్నారు. ఇక వేడి వేడి ఛాయ్‌ను ఈ కప్పుల్లో పోయగానే.. వాటిల్లో ఉండే ప్లాస్టిక్ కణాలు వేడికి కరిగిపోయి టీలో కలిసిపోతాయి. ఇక దాన్నే మనం తాగుతాం. దానితో దీర్ఘకాలిక రోగాలు రావడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన కూడా పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

హార్మోన్ల అసమతుల్యత, దృష్టి లోపాలు, తరుచుగా అలసట చెందడం, చర్మ సంబంధిత రోగాలు లాంటి ఎన్నో సమస్యలు వస్తాయట. మరోవైపు కప్పులకు పూసే ఆర్టిఫీషియల్ వాక్స్ వల్ల జీర్ణప్రక్రియ వ్యవస్థ దెబ్బ తినడమే కాకుండా.. చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ల వాదన. అందుకే పేపర్ కప్పుల కంటే గాజు గ్లాసుల్లోనే టీ తాగడానికి ప్రయత్నించండి.