తెలంగాణ ఆర్టీసీ ఇలా.. కెనడా డాక్టర్లు అలా ! ఎంత తేడా ?

తెలంగాణాలో తమ వేతనాలు పెంచాలని, తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు జరుపుతున్న సమ్మె దాదాపు నెల రోజులు కావస్తోంది.తాజాగా శనివారం ప్రభుత్వంతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. వీరి డిమాండ్లలో సుమారు 21 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత తెలిపినా.. మిగతావి కూడా తీర్చాలనే వీరు పట్టుబడుతున్నారు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే కెనడా.. క్యూబెక్ లోని డాక్టర్లు మాత్రం ఇందుకు పూర్తి విరుధ్ధమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం విశేషం. […]

తెలంగాణ ఆర్టీసీ ఇలా.. కెనడా డాక్టర్లు అలా ! ఎంత తేడా ?
Follow us

|

Updated on: Oct 27, 2019 | 1:45 PM

తెలంగాణాలో తమ వేతనాలు పెంచాలని, తమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు జరుపుతున్న సమ్మె దాదాపు నెల రోజులు కావస్తోంది.తాజాగా శనివారం ప్రభుత్వంతో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. వీరి డిమాండ్లలో సుమారు 21 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత తెలిపినా.. మిగతావి కూడా తీర్చాలనే వీరు పట్టుబడుతున్నారు. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అయితే కెనడా.. క్యూబెక్ లోని డాక్టర్లు మాత్రం ఇందుకు పూర్తి విరుధ్ధమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం విశేషం. దాదాపు 700 మంది డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు తమ వేతనాలు తగ్గించాలని, అలా తగ్గించిన మొత్తాన్ని సామాజిక సేవలకు వినియోగించాలని కోరుతూ వింత నిరసన (సమ్మె అందామా ?) కు దిగారు వాళ్ళు. ‘ మా జీతాలు లక్షల్లో ఉన్నాయి.. దయచేసి వీటిలో కోత విధించండి ‘ అంటూ వారు ఓ ఆన్ లైన్ పిటిషన్ ద్వారా ఓ ‘ ఉద్యమాన్నే ‘ లేవదీశారు. ఈ పిటిషన్ పై 217 మంది జనరల్ ప్రాక్టిషనర్లు, 187 మంది స్పెషల్ ఎనలిస్టులు, 150 మంది రెసిడెంట్ డాక్టర్లు, ఇంకా అనేకమంది మెడికల్ స్టూడెంట్లు సంతకాలు చేశారు. కెనడా డాక్టర్లకు సాలుకు సగటున 4 లక్షల డాలర్లకు పైగా వేతనం లభిస్తుందని కెనడియన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. మాకు తక్కువ జీతాలు చెల్లించండి.. నర్సులు, క్లర్కులు వంటి ఇతర వృత్తులవారు తక్కువ వేతనాలు పొందుతున్నారు. .. రోగులకు అవసరమైన సేవలు లభించడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎక్కువ జీతాలు తీసుకోవడం సమంజసం కాదు ‘ అంటూ వీరంతా గత ఏడాది ఫిబ్రవరి 25 న ‘ సంతకాల సమ్మె ‘ లాంచ్ చేశారు. ఇబ్బడిముమ్మడిగా పెరిగిన జీతాలను ఏం చేసుకోవాలో తెలియక వీరు ‘ అల్లాడుతున్నట్టు ‘ ఉంది. పెంచిన వేతనాలతో బాటు ఇతర అలవెన్సులు, భత్యాలు కూడా భారీ గానే ఉండడమే దీనికి కారణం. కాగా-వీరి డిమాండును ప్రభుత్వం ఇంకా పరిశీలించాల్సి ఉంది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో