దేశవ్యాప్తంగా ఏడు రోజలపాటు సంతాప దినాలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశంలో  విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఏడు రోజలపాటు సంతాప దినాలు
Follow us

|

Updated on: Aug 31, 2020 | 9:03 PM

Seven Day National Mourning  : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశంలో  విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రణబ్‌కు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్‌, రాష్ట్రపతిభవన్‌ సహా అన్ని కార్యాలయాలపైనా జాతీయ జెండాను అవనతం చేశారు.

ఈ నెల 10న అనారోగ్యంతో ఢిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌ ముఖర్జీకి వైద్యులు మెదడులో ఏర్పడిన కణితికి శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్సకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా తేలిందని ప్రణబ్‌ ముఖర్జీయే స్వయంగా తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో 21 రోజులుగా చికిత్సపొందుతున్న ఆయన.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వివిధ మార్గాల్లో సంతాపం తెలుపుతున్నారు.