ప్రశాంత్ భూషణ్, ట్విటర్ ఇండియాపై కోర్టు ధిక్కరణ కేసు

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన, ట్విటర్ ఇండియాపైన కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. సుప్రీంకోర్టు రేపు దీనిపై విచారణ జరపనుంది. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, బీ ఆర్ గవాయ్, కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ దీన్ని..

ప్రశాంత్ భూషణ్, ట్విటర్ ఇండియాపై కోర్టు ధిక్కరణ కేసు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 11:36 AM

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన, ట్విటర్ ఇండియాపైన కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. సుప్రీంకోర్టు రేపు దీనిపై విచారణ జరపనుంది. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, బీ ఆర్ గవాయ్, కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ దీన్ని విచారిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో గత ఆరేళ్లలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో సుప్రీంకోర్టుకు చెందిన  నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కీలక పాత్ర పోషించారని ప్రశాంత్ భూషణ్ ఇటీవల తన ట్విటర్ లో ఆరోపించారు. ఇక ప్రస్తుత సీజేఐ బాబ్డే ఆ మధ్య హార్లే డేవిడ్ సన్ బైక్ ని నడిపారని,  హెల్మెట్ గానీ మాస్క్ గానీ లేకుండా కనిపించారని కూడా ఆయన అన్నారు. కోర్టు లాక్ డౌన్ లో ఉండగా ఒక చీఫ్ జస్టిస్ ఇలా చేయవచ్చా అన్నారు. ట్విటర్ ఇండియా కూడా ఇదేవిధమైన ఆరోపణలు చేసింది.