Breaking News
  • సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ నిలువబోతోంది. గజ్వేల్‌లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు-హరీష్‌రావు.
  • ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్‌ ప్రెస్‌మీట్‌. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్‌ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్‌చేసుకోవచ్చ -ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌
  • రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
  • విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్‌ దాడులు ఈ-టికెట్లు బ్లాక్‌ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్‌. కటక్‌కు చెందిన సమీర్‌కుమార్‌ ప్రధాన్‌, దుర్గారావు అరెస్ట్‌. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేస్తున్న నిందితులు ల్యాప్‌టాప్‌, డాక్యుమెంట్లు సీజ్‌చేసిన ఆర్పీఎఫ్‌
  • కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్‌గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్‌ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్‌వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • వరంగల్‌: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్‌రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్‌ బోల్తా. రాంపూర్‌కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.

‘కొబ్బరిమట్ట’ సాంగ్.. టాప్ హీరోల స్టెప్పులతో ఇరగదీసిన సంపు

Kobbari Matta Song Teaser, ‘కొబ్బరిమట్ట’ సాంగ్.. టాప్ హీరోల స్టెప్పులతో ఇరగదీసిన సంపు

‘హృదయకాలేయం’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ సపరేట్ గుర్తింపును తెచ్చుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఈయన నటించిన చిత్రం కొబ్బరిమట్ట ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి విడుదల తేది ఫిక్స్ అయ్యింది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది కొబ్బరిమట్ట. అయితే ఈ లోపే ఓ పాటేసుకోండి అన్నట్లుగా ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అ, ఆ, ఇ, ఈ అంటూ సాగే పాటలో సంపూ తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. టాలీవుడ్ టాప్‌స్టార్లను ఇమిటేట్ చేస్తూ అందులో ఇరగదీశాడు సంపూ. ప్రస్తుతం ఈ పాట తెగ వైరల్ అవుతోంది. కొబ్బరిమట్ట మూవీపై మరింత హైప్ పెరగడానికి ఈ సాంగ్ ఒక్కటి చాలంటున్నారు నెటిజన్లు.

కాగా ఈ పాటపై టాలీవుడ్ సెలబ్రిటీలు సాయి ధరమ్ తేజ్, వెన్నెల కిశోర్ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ‘‘సంపూర్ణేష్ అన్న నువ్వు ఈ పాటను అదరగొట్టావు. సాయి రాజేష్ మీ సాహిత్యానికి హ్యాట్సాఫ్. నీ డ్యాన్స్ మాత్రం సూపర్ సంపూ అన్న’’ అంటూ కామెంట్ పెట్టాడు.

ఇక వెన్నెల కిశోర్ కూడా స్పందిస్తూ.. ’’అద్భుతమైన లిరిక్స్.. అదిరిపోయే స్టెప్పులు.. సాంగ్ ప్రోమో.. సంపూ రాక్స్’’ అంటూ కామెంట్ పెట్టాడు.

కాగా ఈ మూవీలో సంపు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ ఇలా మూడు విభిన్నమూన పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు కూడా మహా రెస్పాన్స్ వచ్చింది. ఇక హృదయకాలేయం సినిమాతో సోషల్ మీడియాను షేక్ చేసిన సంపూ కొబ్బరిమట్టతో ఆ సినిమాను బీట్ చేస్తాడనే అనిపిస్తుంది. చూడాలి థియేటర్లో సంపూ మనల్ని ఎంతగా నవ్విస్తాడో.