పంచెకట్టు పవర్.. ఫస్ట్ లుక్ అదుర్స్!

ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన నటిస్తున్న ‘హిప్పీ’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా అర్జున్ జంధ్యాల అనే నూతన దర్శకుడితో కార్తికేయ ‘గుణ 369’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కూల్‌గా పంచెకట్టుతో కనిపిస్తున్న కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ […]

పంచెకట్టు పవర్.. ఫస్ట్ లుక్ అదుర్స్!
Follow us

|

Updated on: May 29, 2019 | 7:01 PM

ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన నటిస్తున్న ‘హిప్పీ’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉండగా అర్జున్ జంధ్యాల అనే నూతన దర్శకుడితో కార్తికేయ ‘గుణ 369’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కూల్‌గా పంచెకట్టుతో కనిపిస్తున్న కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కాగా ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. తిరుమల రెడ్డి, అనిల్ కడియాల కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.