రెండో రోజూ పార్లమెంటులో ..కర్ణాటక ‘ రచ్ఛ’..

కర్ణాటక రాజకీయ సంక్షోభం వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా పార్లమెంటును కుదిపివేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభలో ఆరోపించారు. రాజీనామాలు చేసిన వెంటనే రెబెల్ ఎమ్మెల్యేలు బెంగుళూరులో విమానాశ్రయానికి వెళ్లారని, అక్కడ వారి కోసం ఓ విమానం సిధ్ధంగా ఉందని, అది ముంబై చేరగానే అక్కడ ఓ హోటల్ కూడా రెడీగా ఉందని..ఇదంతా కమలం పార్టీ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ లోక్ సభా […]

రెండో రోజూ పార్లమెంటులో ..కర్ణాటక ' రచ్ఛ'..
Follow us

|

Updated on: Jul 09, 2019 | 3:02 PM

కర్ణాటక రాజకీయ సంక్షోభం వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా పార్లమెంటును కుదిపివేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభలో ఆరోపించారు. రాజీనామాలు చేసిన వెంటనే రెబెల్ ఎమ్మెల్యేలు బెంగుళూరులో విమానాశ్రయానికి వెళ్లారని, అక్కడ వారి కోసం ఓ విమానం సిధ్ధంగా ఉందని, అది ముంబై చేరగానే అక్కడ ఓ హోటల్ కూడా రెడీగా ఉందని..ఇదంతా కమలం పార్టీ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ లోక్ సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఖండించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. అది జేడీ-ఎస్, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, బీజేపీకి సంబంధం లేదని అన్నారు. కర్ణాటకలో మీ ప్రభుత్వాన్ని నడుపుకోవడం చేతకాక ఇక్కడ మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు-రాజ్యసభలోనూ ఇదే అంశంపై రభస జరిగింది. కర్ణాటక పరిణామాలపై చర్చించేందుకు అనుమతినివ్వడానికి సభ చైర్మన్ వెంకయ్యనాయుడు నిరాకరించారు. ఇందుకు ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకు వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పరిస్థితి ఎంతసేపటికీ అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ సభను మొదట ఉదయం 11 గంటలకు.. వాయిదా వేశారు. అయితే సభలో తిరిగి అదే గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఇక సభను బుధవారానికి వాయిదా వేశారు.