అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి

ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా గ్రోత్ (డైరెక్ట్ ప్లాన్) 1993 డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ ఫండ్ దాదాపుగా 100 రెట్లు ఆదాయాన్ని రాబట్టింది. వార్షికంగా దాదాపు 20 శాతం లాభాలను అర్జించింది. దీనర్థం మీరు ఈ ఫండ్ ప్రారంభంలోనే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు దాని విలువ కోటి రూపాయలు అయ్యి ఉండేది. ఈ ఫండ్ ప్రధానంగా మిడ్ క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడంపైనే దృష్టి కేంద్రీకరించింది. దీంతో అధిక రాబడులు సాధ్యమయ్యాయి. […]

అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 3:20 PM

ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా గ్రోత్ (డైరెక్ట్ ప్లాన్) 1993 డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ ఫండ్ దాదాపుగా 100 రెట్లు ఆదాయాన్ని రాబట్టింది. వార్షికంగా దాదాపు 20 శాతం లాభాలను అర్జించింది. దీనర్థం మీరు ఈ ఫండ్ ప్రారంభంలోనే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు దాని విలువ కోటి రూపాయలు అయ్యి ఉండేది.

ఈ ఫండ్ ప్రధానంగా మిడ్ క్యాప్ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడంపైనే దృష్టి కేంద్రీకరించింది. దీంతో అధిక రాబడులు సాధ్యమయ్యాయి. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ ఏయూఎం విలువ రూ.6,491 కోట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ తర్వాత మిడ్ క్యాప్ విభాగంలో ఇదే అతిపెద్ద ఫండ్ స్కీమ్.

గత పదేళ్ల కాలంలో చూస్తే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా గ్రోత్ డైరెక్ట్ ప్లాన్ వార్షికంగా 25.54 శాతం రాబడిని అందించింది. ఈ విభాగంలో రెండో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఈ ఫండ్ 60 భిన్నమైన కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. వీటిల్లో బేయర్ కార్పొరేషన్, ఫినొలెక్స్ కేబుల్స్, జేకే సిమెంట్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, వోల్టాస్ వంటి స్టాక్స్ అదిరిపోయే రాబడులు అందించాయి.

ఫండ్ టాప్ 10 హోల్డింగ్స్… హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, సిటీ యూనియన్ బ్యాంక్, ఫినొ‌లెక్స్ కేబుల్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌కేఎఫ్ ఇండియా, ఇన్ఫో ఎడ్జ్ ఇండియా, రామ్‌కో సిమెంట్స్, వోల్టస్, అపోలో టైర్స్ ఉన్నాయి.

ఇన్వెస్టర్లు కనీసం రూ.5,000 మొత్తంతో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్లు ప్రారంభించొచ్చు. ఎంట్రీ చార్జీలు ఉండవు. అలాగే ఎగ్జిట్ చార్జీలు కూడా లేవు. అయితే ఇన్వె్స్ట్‌ చేసిన ఏడాదిలోపే ఫండ్ నుంచి తప్పుకోవాలంటే ఒక శాతం ఎగ్జిట్ చార్జీ చెల్లించాలి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో