Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • భారత్ బయోటెక్‌కు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ. భారత కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేయాలని సూచన. ఫాస్ట్-ట్రాక్ పద్ధతిలో క్లినికల్ ట్రయల్స్ చేస్తే ఆగస్ట్ 15 నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్. పంద్రాగస్టు సందర్భంగా వ్యాక్సిన్ లాంఛ్ చేసే అవకాశం.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • తల్లితండ్రుల పిల్ పై హైకోర్టులో విచారణ వాయిదా. 13వ తారీఖున సమగ్ర నివేదికతో రమ్మని ప్రభుత్వానికి చెప్పిన హైకోర్టు. ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని కోర్టుకు తెలిపిన ఏజీ. ఏ నిర్ణయం తీసుకోకుండా ఆన్లైన్ క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు. కేసులో ఇంప్లీడ్ అయిన ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్. రెండు నెలల క్రితమే సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభమైందని తెలిపిన isma తరపు సీనియర్ న్యాయవాది. ఆన్లైన్ తరగతులపై తల్లిదండ్రులకు పై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆన్లైన్ క్లాసెస్ ఆప్షన్ మాత్రమే అని తెలిపిన ఇస్మా తరపు న్యాయవాది.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • ఈరోజు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. ఉపరితల ఆవర్తనం తో పాటు షీర్ జోన్ ఏర్పడింది. ఆంధ్ర తీరానికి సమీపంలో కేంద్రీక`తమైన ఆవర్తనం. పశ్చిమ బంగాళాఖాతం లో 3.1 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. - వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్టు రాజారావు.
  • జ్యూడిషయల్ లోకరోనా కలకలం . సికింద్రాబద్ జ్యుడీషయల్ అకాడమీ లో కరోనాతో అటెండర్ మృతి . జ్యుడిషయల్ అకాడమీ కేంద్రం గా జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్. ఆందోళనలో న్యాయవాదులు.

అమ్మ రోజా.. ఏమి ‘జబర్దస్త్’ టార్గెట్..?

roja next target superb, అమ్మ రోజా.. ఏమి ‘జబర్దస్త్’ టార్గెట్..?

జబర్దస్త్‌ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్‌ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్‌ రావడంతో మంత్రి పదవిపై ఆమె ఆశపడ్డారు. కానీ రాజకీయ లెక్కలు కలిసి రాలేదు. అయితే ఆమె టార్గెట్‌ మార్చారు? కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఏంటా లక్ష్యం ?

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా…ఏపీఐఐసీ ఛైర్మన్‌. వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ జిల్లాలో రాజకీయ సమీకరణాలు..ఇతర కారణాలతో ఆమెకు మంత్రి పదవి రాలేదు. దీంతో ఆమెను ఏపీఐఐసీకి ఛైర్మన్‌ చేశారు సీఎం జగన్‌. అయితే ఇప్పుడు రోజా సరికొత్త టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆమె ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతో గెలిచారు. చివరి వరకు ఆమె ఓడిపోతారనే ప్రచారం జరిగింది. కానీ చివరికి రెండు వేల బోటాబోటీ ఓట్లతో ఆమె గెలిచారు. రోజాకు నియోజకవర్గంపై పట్టు లేదనే విమర్శలు ఆమెపై అప్పట్లో వినిపించాయి. మెజార్టీ రాకపోవడంతో పాటు నగరిలో పరిస్థితులు ఆమెకు మంత్రి పదవికి దూరం చేశాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు రోజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌ అయిన తర్వాత రోజా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు.

గతంలో రోజా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా… టీవీ షోల మీద ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. ఇకపై ఆ ముద్ర లేకుండా పూర్తిగా నియోజకవర్గానికి ప్రయారిటీ ఇవ్వాలని రోజా నిర్ణయించుకున్నారట. అందుకే ఇకపై కొత్త షోలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం జబర్దస్త్ షోకే పరిమితం కావాలని రోజా నిర్ణయించుకున్నారట. కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు నగరిలోనే రోజా ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం కూడా చేశారు.

మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్‌ ఇప్పటికే హింట్‌ ఇచ్చారు. దీంతో విస్తరణలో బెర్త్‌ ఎలాగైనా సంపాదించాలనే లక్ష్యంతో రోజా ముందుకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రోజా టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. మరీ అందులో విజయం సాధిస్తారో లేదో వేచిచూడాలి.

Related Tags