రణరంగంగా మారిన హాంకాంగ్ యూనివర్సిటీ

హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోయింది. ఆదివారం రాత్రి ఈ యూనివర్సిటీ ఆవరణలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు తమ భవిష్యత్ కార్యాచరణకు మరో వ్యూహం పన్నాలని, ఇక్కడికి వచ్ఛే పోలీసులను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించారు. అయితే సోమవారం ఉదయానికి అక్కడికి చేరిన పోలీసులపై వారు పెట్రోలు బాంబులు, బాణాలతో విరుచుకపడ్డారు. భారీ సంఖ్యలో ఉన్న వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. రబ్బరు బులెట్లతో కాల్పులు […]

రణరంగంగా మారిన హాంకాంగ్ యూనివర్సిటీ
Follow us

|

Updated on: Nov 18, 2019 | 5:18 PM

హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోయింది. ఆదివారం రాత్రి ఈ యూనివర్సిటీ ఆవరణలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు తమ భవిష్యత్ కార్యాచరణకు మరో వ్యూహం పన్నాలని, ఇక్కడికి వచ్ఛే పోలీసులను ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించారు. అయితే సోమవారం ఉదయానికి అక్కడికి చేరిన పోలీసులపై వారు పెట్రోలు బాంబులు, బాణాలతో విరుచుకపడ్డారు. భారీ సంఖ్యలో ఉన్న వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. రబ్బరు బులెట్లతో కాల్పులు జరిపారు. పోలీసులతో కూడిన ఓ ట్రక్కు ఘటనా స్థలానికి వస్తుండగా.. నిరసనకారులు దానిపై పెట్రోలు బాంబులను విసరడంతో ఒక్కసారిగా నిప్పంటుకుని అది అగ్నికి ఆహుతైంది. మాస్కులతో వఛ్చిన పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి యత్నించిన అనేకమందిని వారు అరెస్టు చేశారు. గాయాలతో రక్తమోడుతున్న వారిని కూడా బలవంతంగా అరెస్టు చేసి తీసుకుపోయారు. అనేక చోట్ల జరిగిన ఆందోళనల్లో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. హాంకాంగ్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుధ్ధరించాలని, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.