రియా చక్రవర్తి అరెస్టు అతి ముఖ్యమైన చర్య, బిహార్ డీజీపీ

సుశాంత్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు అతి ముఖ్యమైన చర్య అని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే అన్నారు. ఇది సుశాంత్ కి న్యాయం చేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు.

రియా చక్రవర్తి అరెస్టు అతి ముఖ్యమైన చర్య, బిహార్ డీజీపీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 09, 2020 | 2:13 PM

సుశాంత్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు అతి ముఖ్యమైన చర్య అని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే అన్నారు. ఇది సుశాంత్ కి న్యాయం చేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ చాలా అవసరమని తాము మొదటినుంచీ చెబుతూనే ఉన్నామని, ఇప్పటికైనా సుశాంత్ కుటుంబానికి న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రియాతో బాటు మరికొందరిపై కూడా ‘చర్య’ అవసరమని పాండే పేర్కొన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు కూడా తప్పుడు మార్గంలో దర్యాప్తు చేశారని ఆయన అన్నారు.

సుశాంత్ సిస్టర్స్ పై  రియా ఫోర్జరీ కేసు పెట్టడాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి, ఇది కేసును తప్పుదారి పట్టించడానికే అని ఆరోపించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అండగా ఎందుకు నిలిచిందో అర్థం కావడంలేదని బీహార్ లోని  బీజేపీ నేతలు అన్నారు. ముంబై పోలీసులు ఆమెకు వత్తాసుగా నిలిచారని వారు ఆరోపించారు.  మొదటి నుంచీ వారి దర్యాప్తు తీరు ఇందుకు నిదర్శనంగా నిలిచిందన్నారు.