Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Undavalli on Jagan: ఉండవల్లి మాటల వెనుక మర్మమిదే

ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకసారి జగన్‌కు ప్రేమతో సూచనలు చేస్తారు. మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తారు. ఇలా ఎందుకు జగన్‌ సర్కార్‌కు హెచ్చరికలు చేస్తున్నారని అంటే.. తానొక సిటిజన్‌ అని... తనకు ఆ స్వేచ్ఛ వుందని సెలవిస్తారు.
reason behind undavalli criticism, Undavalli on Jagan: ఉండవల్లి మాటల వెనుక మర్మమిదే

Undavalli Arun Kumar warns YS Jagan Government: ఈ మాజీ ఎంపీ ఒకరోజు జగన్‌‌ని తెగ పొగడేస్తారు. మా రాజశేఖర్‌రెడ్డి కొడుకు అంటారు. కరెక్ట్‌ లైన్‌లో వెళుతున్నారని కితాబు ఇస్తారు. ప్రశంసలు కురిపిస్తారు. కానీ అంతలోనే రూటు మార్చేస్తారు. ఉండవల్లి జగన్ లైన్‌లో ఉన్నాడు. ఎంతైనా ఆయన మిత్రుని కొడుకు కదా? అని అందరూ అనుకునే లోపే బహిరంగ లేఖలు రాస్తారు. కీలక సూచనలు చేస్తారు. మీరు రాంగ్‌ రూట్లో నడుస్తున్నారని హెచ్చరికలు జారీ చేస్తారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకసారి జగన్‌కు ప్రేమతో సూచనలు చేస్తారు. మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తారు. ఇలా ఎందుకు జగన్‌ సర్కార్‌కు హెచ్చరికలు చేస్తున్నారని అంటే.. తానొక సిటిజన్‌ అని… తనకు ఆ స్వేచ్ఛ వుందని సెలవిస్తారు. మీడియా తనకు ప్రాధాన్యత ఇచ్చినన్ని రోజులు తన వెర్షన్‌ వినిపిస్తానని అంటారు. మొత్తానికి ఉండవల్లి ఇలా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజశేఖర్ రెడ్డి కొడుకు మాట తప్పడు.. మడమ తిప్పడు అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటారు ఉండవల్లి. ప్రభుత్వాల తప్పులు ఎన్నడమే తనపని అని…. త్వరలో జగన్ సర్కార్ పై కూడా ఛార్జ్ షీట్ ఇస్తా అని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ బేసిగ్గా కాంగ్రెస్‌ వాది. ఆయనకు బీజేపీ అంటే పడదు. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలకు ఆయన మొదటి నుంచి వ్యతిరేకం. ఇటీవల వైసీపీ, బీజేపీకి దగ్గరవుతుందనే ప్రచారం నేపథ్యంలో ఉండవల్లి జగన్‌ సర్కార్‌ టార్గెట్‌గా విమర్శలు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్‌కు రాష్ట్ర పరిస్థితి, ఇతర అంశాలను తెలియజేసేందుకు ఉండవల్లి మాట్లాడారని కొందరు నేతలు అంటున్నారు. మొత్తానికి ఉండవల్లి వ్యాఖ్యలు ఏపీ రాజకీయంలో చర్చనీయాంశంగా మారాయి.

Also read: Lokesh discloses family assets

Related Tags