అమెరికా అధ్యక్ష ఎన్నికల బ‌రిలో ర్యాపర్ కేన్​ వెస్ట్..​

నవంబరు 3న అమెరికా అధ్యక్ష​ ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు అమెరికన్ ఫేమ‌స్​ ర్యాపర్​ కేన్​ వెస్ట్​. ఈ విషయాన్ని సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా తెలియ‌జేశాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బ‌రిలో ర్యాపర్ కేన్​ వెస్ట్..​
Follow us

|

Updated on: Jul 05, 2020 | 4:08 PM

నవంబరు 3న అమెరికా అధ్యక్ష​ ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు అమెరికన్ ఫేమ‌స్​ ర్యాపర్​ కేన్​ వెస్ట్​. ఈ విషయాన్ని సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా తెలియ‌జేశాడు. ఈ నిర్ణ‌యానికి కేన్​ వెస్ట్​ భార్య కిమ్​ కర్దాషియాన్​తో పాటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ల నుంచి మద్దతు ల‌భించింది.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పోయిన సంవ‌త్స‌రం జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు కేన్​ వెస్ట్. 2024 ప్రెసిడెంట్ ఎన్నికల్లో బ‌రిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నానని అప్పట్లో తెలిపాడు. కాగా 2018 అక్టోబరులో ట్విట్టర్​ ద్వారా ట్రంప్​కు మద్దతు ప్ర‌క‌టించాడు కేన్​ వెస్ట్​. ఆ తర్వాత వైట్​హౌస్​కు వెళ్లి.. ట్రంప్​ ట్రేడ్​మార్క్​గా నిలిచిన ‘మేక్​ అమెరికా గ్రేట్​ ఎగైన్​’ టోపీని ధరించి స్పీచ్ ఇచ్చాడు. అయితే నిద్రలేక‌పోవ‌డంతో అలా చేశానని ఇప్పుడు చెబుతున్నాడు కేన్.