Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • సిద్దిపేట: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు ప్రారంబించనున్నారు .. కార్యక్రమానికి హాజరుకానున్న చిన జీయర్ స్వామి..
  • నేడు మరో రెండు పిటిషన్లపై విచారణ.. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు విచారణ.. ఇప్పటికే 49 మంది కి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. ఎల్జి పాలిమర్స్ కేసును విచారించిన ధర్మాసనం.
  • అమరావతి: నేడు కీలక తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు అంశంపై కీలక తీర్పు ఇవ్వనున్న హైకోర్టు.
  • మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం. మహారాష్ట్ర లో ఈరోజు 2598 కరోనా పాజిటివ్ కేస్ లు,85 మంది మృతి. మహారాష్ట్ర రాష్ట్రంలో 59546 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 1982 మంది మృతి.
  • టీ-20 వరల్డ్ కప్ సహా క్రికెట్ టోర్నమెంట్లపై ఎటూ తేల్చని ఐసీసీ. ఎలాంటి నిర్ణయం లేకుండా ముగిసిన నేటి సమావేశం. జూన్ 10న మరోసారి సమావేశమయ్యే అవకాశం. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం.

ఫోకస్ మార్చిన ఆర్జీవీ.. అతడిని వదిలేసినట్లేనా..!

Ram Gopal Varma released song on KA Paul, ఫోకస్ మార్చిన ఆర్జీవీ.. అతడిని వదిలేసినట్లేనా..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫోకస్‌ను మార్చేశాడు. ఎవ్వరినైనా సరే ఒక్కసారి పట్టుకుంటే అంత ఈజీగా వదిలేయని వర్మ.. జొన్నవిత్తుల విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గాడు.  జొన్నపొత్తు గురించి ఇక చాలు అని.. ఇప్పుడు మరో జోకర్ పాల్ బాయ్ మీద తన ఫోకస్ మారిపోయిందని అతడు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇక అంతటితో ఆగని వర్మ.. తాను తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో కేఏ పాల్‌పై తీసిన పాటను విడుదల చేశాడు.

అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఏ పాల్ వ్యవహరించిన తీరు.. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను కామెడీగా చూపించారు. అయితే ఆ పాట ట్యూన్‌కు సంపూర్ణేష్ బాబు నటించిన ‘హృదయ కాలేయం’లోని ‘నేనే సంపు.. ముద్దు పేరే తెగింపు’తో పాటు కాస్త జేమ్స్ బాండ్ మ్యూజిక్‌ను యాడ్ చేయడం గమనర్హం. ఏదేమైనా కేఏ పాల్‌పై సెటైరికల్‌గా వచ్చిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి జొన్నపొత్తులను వర్మ వదిలేసినట్లేనా..? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

కాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయంలో వర్మకు, జొన్నవిత్తులకు మధ్య వివాదం మొదలైంది. ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. జొన్నవిత్తులకు జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇవ్వగా.. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. వర్మ బతికున్న శవం లాంటివాడు. పప్పు వర్మ అనే బయోపిక్ తీసి అతడి బండారం బయటపెడతానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. దీనికి వర్మ స్పందిస్తూ.. ‘‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబి, లేకపోతే ఫ్రస్టేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్ వాళ్ల మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్. కానీ ఐ లవ్ యు డా’’ అంటూ ఆ ట్వీట్‌లో వర్మ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

 

Related Tags