చిరు కోసం చెర్రీ మరో అవతారం..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఇప్పటినుంచే హైప్ వచ్చేలా రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రమోషన్లను ప్రారంభించాలనుకుంటోన్న చెర్రీ.. మొదటగా చిరు ఇంటర్వ్యూను విడుదల చేయాలనుకుంటున్నాడు. సైరా మేకింగ్, […]

చిరు కోసం చెర్రీ మరో అవతారం..?
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 12:39 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రంపై ఇప్పటినుంచే హైప్ వచ్చేలా రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రమోషన్లను ప్రారంభించాలనుకుంటోన్న చెర్రీ.. మొదటగా చిరు ఇంటర్వ్యూను విడుదల చేయాలనుకుంటున్నాడు. సైరా మేకింగ్, సినిమా అప్‌డేట్స్, బడ్జెట్, స్టోరీ లైన్ ఇలా అన్నీ కవర్ అయ్యేలా చిరంజీవి ఇంటర్వ్యూ ఉండబోతుందట. అంతేకాదు ఇక ఈ ఇంటర్వ్యూ కోసం రామ్ చరణ్ యాంకర్ అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగాభిమానుల ఆనందానికి హద్దులుండవు.