రమ్యకృష్ణ దారిలోనే రకుల్, పూజ హెగ్డే!

కరోనా వచ్చి లాక్ డౌన్ అనడంతో మూసేసిన చాలా వ్యాపారాలు మళ్ళీ తెరుచుకున్నాయి. కానీ సినిమా ఫీల్డ్ మాత్రం ఇంకా షట్ డౌన్ మోడ్ లోనే ఉంది. దానికి కారణం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ షూటింగ్ చెయ్యడమే. అందుకే..

రమ్యకృష్ణ దారిలోనే రకుల్, పూజ హెగ్డే!
Follow us

|

Updated on: Aug 24, 2020 | 7:28 PM

కరోనా వచ్చి లాక్ డౌన్ అనడంతో మూసేసిన చాలా వ్యాపారాలు మళ్ళీ తెరుచుకున్నాయి. కానీ సినిమా ఫీల్డ్ మాత్రం ఇంకా షట్ డౌన్ మోడ్ లోనే ఉంది. దానికి కారణం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ షూటింగ్ చెయ్యడమే. అందుకే డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని,మెగా ఫోన్ లో ఎప్పుడెప్పుడు యాక్షన్ చెబుదామా అని రెడీ గా ఉన్నా కూడా యాక్షన్ చెయ్యాల్సిన హీరోలు మాత్రం ఇంకా రెస్టింగ్ మోడ్ లోనే ఉంటున్నారు.

అయితే, హీరోలు ఆన్ లొకేషన్ అనే మాటకి అంత దూరంలో ఉంటుంటే హీరోయిన్స్ మాత్రం రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ,షాట్ లో సై అంటూ యాక్షన్ ఇరగదియ్యడానికి సిద్ధంగా ఉన్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ అయితే ఆల్రెడీ షూటింగ్ లో జాయిన్ అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. పైగా సమ్మర్ హాలిడేస్ తరువాత స్కూల్ కి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందంటూ చెప్పుకొచ్చారు శివగామి.

యంగ్ హీరోయిన్స్ కూడా బోరింగ్ హాలిడేస్ అంటూ ఆన్ లొకేషన్ లో అదరగొట్టడానికి రెడీ అయ్యారు. ముందుగా రకుల్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యింది. అర్జున్ కపూర్ తో కలిసి ఒక క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీ లో నటిస్తుంది రకుల్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 25 నుండి స్టార్ట్ కాబోతుంది అంటూ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం రెండు షెడ్యూల్స్ లో 14 రోజుల షూటింగ్ ప్లాన్ చేసారు. ఒకప్పుడు సినిమా షూటింగ్ కి ఇలా డేట్ అనౌన్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆగిపోయిన షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది అని కూడా కన్వే చేసే కొత్త కల్చర్ పుట్టుకొచ్చింది.

ఇక దాదాపు 150 రోజుల లాంగ్ హాలిడే తీసుకున్న బెంగుళూరు బ్యూటీ పూజా హెగ్డే కి కూడా బోర్ కొట్టిందట. అందుకే ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళదామా అని చూస్తుంది. నేను షూటింగ్ కి రెడీ అంటుంది అమ్మడు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన అఖిల్ రిస్క్ తీసుకోవడానికి రెడీ గా లేడు. ప్రభాస్ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేసుకుంటూ వెళుతున్నాడు తప్ప ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనే ఉద్దేశం లేదు. అలా పూజ కోరిక ఏ విధంగానూ నెరవేరే అవకాశం లేదు. సో, బ్యూటీస్ అంత షూటింగ్ లేక బోరింగ్ ఫీల్ అవుతుంటే హీరోలు మాత్రం వెయిట్ అండ్ వెయిట్ అంటూ సేఫ్ జోన్ లో ఉంటున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు