సొంతిల్లే సో బెటరంటున్న రాజగోపాల్..ఎందుకంటే?

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంప్రమైజ్ అయ్యారా? అందుకే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుని తిరుగుతున్నారా? పరిస్థితిని విశ్లేషిస్తే అంతేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. బిజెపిలో చేరిపోయినంత పని చేసిన రాజ్‌గోపాల్ రెడ్డి.. ఉన్నట్లుండి రూటు మార్చారు. క్రమం తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు. దాంతో రాజ్‌గోపాల్ రెడ్డి తీరు అర్థం కాక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం బుర్రబద్దలు కొట్టుకుంటోందట. బిజెపిని అదే పనిగా పొగిడేసిన రాజ్‌గోపాల్ రెడ్డి వీలైతే తనపై […]

సొంతిల్లే సో బెటరంటున్న రాజగోపాల్..ఎందుకంటే?
Follow us

|

Updated on: Dec 11, 2019 | 7:41 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంప్రమైజ్ అయ్యారా? అందుకే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుని తిరుగుతున్నారా? పరిస్థితిని విశ్లేషిస్తే అంతేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. బిజెపిలో చేరిపోయినంత పని చేసిన రాజ్‌గోపాల్ రెడ్డి.. ఉన్నట్లుండి రూటు మార్చారు. క్రమం తప్పకుండా కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారు. దాంతో రాజ్‌గోపాల్ రెడ్డి తీరు అర్థం కాక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం బుర్రబద్దలు కొట్టుకుంటోందట.

బిజెపిని అదే పనిగా పొగిడేసిన రాజ్‌గోపాల్ రెడ్డి వీలైతే తనపై చర్య తీసుకోవాలన్నంత స్థాయిలో రెచ్చిపోయారు. ఇంకేముంది ఆయన కమల దళంలో చేరిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. దాంతోపాటు కొన్నాళ్ళు పార్టీ కార్యకలాపాలకు దూరంగా కూడా వున్నారు. కానీ అంతలోనే రూటు మార్చారు. ఇంతకూ రాజగోపాల్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌తోనే ఎందుకు సర్దుకుని పోతున్నారు? ఆయనకి బీజేపీ గేట్లు మూసేసిందా? లేకుంటే అన్నకి టీపీసీసీ పదవి వస్తుందన్న నమ్మకంతో పార్టీలో కంటిన్యూ అవుతున్నారా? ఈ చర్చ ఇప్పుడు గాంధీభవన్‌లో జోరుగా జరుగుతోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్నాళ్లు కాంగ్రెస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అప్పట్లో బీజేపీని పొగిడి పొగిడి బాగా అలసిపోయారు. బీజేపీలో చేరుతున్నానని కూడా అప్పట్లో సంకేతాలిచ్చారు. ఢిల్లీ కూడా వెళ్లొచ్చారు. మళ్లీ ఇంతలోనే ఏమైందో ఏమిటో కానీ, మళ్లీ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఆపార్టీ శాసనసభా పక్ష సమావేశానికి కూడా హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.

అయితే బీజేపీలోకి వెళ్లడానికి తహతహలాడిన, రాజగోపాల్‌రెడ్డికి కమలం బ్రేకులు వేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. లేదా మూడోవంతు ఎమ్మల్యేలు బీజేపీలో జాయినయ్యేలా చూడాలి. ఈ రెండు కండీషన్స్‌ని బీజేపీ పెట్టడంతో రెండూ సాధ్యం కావని గుర్తించిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవడమే బెటరనుకున్నారని కొంత మంది చెబుతున్నారు. ఈ సంగతి ఇలా వుంటే, మరోవైపు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. టీపీసీసీ అధ్యక్ష రేసులో కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో హస్తంతో ప్రయాణమే మంచిదన్న అభిప్రాయానికి రాజగోపాల్ రెడ్డి వచ్చినట్లు భావిస్తున్నారు కొందరు. అన్నకు పీసీసీ అధ్యక్ష పీఠం వస్తే కాంగ్రెస్‌పార్టీని బలపరిచే కార్యక్రమాల్లో చురుకుగా ఉండొచ్చన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.