సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోన్న రాహుల్ వీడియో

కేరళ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. పతనంతిట్టలో జరిగిన ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. ఆయన స్పీచ్‌ను పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్‌పర్సన్ పీజే కురియన్ మలయాళంలోకి అనువాదం చేశారు. అయితే అనువాదం చేసే సమయంలో కురియన్ చాలాసార్లు తడబడ్డారు. Rahul Gandhi's baseless allegations are not only difficult to comprehend, but also hard to translate. Watch this gold […]

సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోన్న రాహుల్ వీడియో
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2019 | 2:58 PM

కేరళ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. పతనంతిట్టలో జరిగిన ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. ఆయన స్పీచ్‌ను పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్‌పర్సన్ పీజే కురియన్ మలయాళంలోకి అనువాదం చేశారు. అయితే అనువాదం చేసే సమయంలో కురియన్ చాలాసార్లు తడబడ్డారు.

పలుమార్లు రాహుల్ ప్రసంగాన్ని తప్పుగా అనువదించిన కురియన్..‘‘జనాల అరుపులకు మీ మాటలు సరిగా వినిపించడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ ఆపకుండా ప్రసంగం చేస్తుంటే అది అర్థం చేసుకోవడానికి తరచూ కురియన్ చూపించిన హావభావాలు కామెడీని పూయిస్తున్నాయి. అయితే అనువాదంలో కురియన్ తరచూ తడబడుతుంటంతో రాహుల్ ఓపిక నశించి తన ప్రసంగాన్ని ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.