‘పబ్ జీ’ గేమ్ ఎఫెక్ట్.. సొంతబావపై దాడి

కొన్ని గేమ్స్ ట్రెండ్స్ ను సృష్టిస్తాయి.. అందులో ఒకటి ప్రస్తుతం టాప్ గా అందర్నీ ఊగిసలాడిస్తున్న గేమ్. ఈ గేమ్ కి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎడిక్ట్ అయిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, అందులో నెట్ సౌకర్యం ఉంటే చాలు. ఖాళీ దొరికినప్పుడల్లా ఈ గేమ్ నే ఆడేస్తున్నారు. పబ్ జీ.. ఈ గేమ్ అందరికీ తెలిసినదే. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ గేమ్ ను రోజూ ఆడుతున్నారు. అయితే.. దీన్ని ఆడుతున్న కొద్దీ […]

‘పబ్ జీ’ గేమ్ ఎఫెక్ట్.. సొంతబావపై దాడి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:01 PM

కొన్ని గేమ్స్ ట్రెండ్స్ ను సృష్టిస్తాయి.. అందులో ఒకటి ప్రస్తుతం టాప్ గా అందర్నీ ఊగిసలాడిస్తున్న గేమ్. ఈ గేమ్ కి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎడిక్ట్ అయిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, అందులో నెట్ సౌకర్యం ఉంటే చాలు. ఖాళీ దొరికినప్పుడల్లా ఈ గేమ్ నే ఆడేస్తున్నారు. పబ్ జీ.. ఈ గేమ్ అందరికీ తెలిసినదే. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ గేమ్ ను రోజూ ఆడుతున్నారు. అయితే.. దీన్ని ఆడుతున్న కొద్దీ యువతలో హింసాత్మక భావనలు పెరుగుపోతున్నాయట. తాజా.. ఈ గేమ్ ఆడొద్దని చెప్పింనందుకు సొంత భావన్ ఓ యువకుడు కత్తితో పొడిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ముంబైకి చెందిన రజనీష్(27) అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. రజనీష్ సోదరికి ఇటీవలె అంబరీష్ అనే వ్యక్తికి ఇచ్చి ఎన్గేజ్మెంట్ చేశారు. ఒక పనిమీద అత్తారింటికి వచ్చిన అంబరీష్ తన లాప్ టాప్ కి చార్జింగ్ పెట్టుకున్నాడు. అయితే రజనీష్ పబ్ జీ గేమ్ ఆడుతుండగా తన ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయివడంతో గేమ్ లో ఫెయిల్ అయ్యాడు. ఆ ఉక్రోశంతో తన బావ పెట్టిన ఛార్జింగ్ ను కత్తితో కట్ చేసేశాడు. ఇది గమనించిన అంబరీష్.. గేమ్ లతో ఏమొస్తుందని, చక్కగా చదువుకోమని చెప్పగా.. రషనీష్ ఎదురుతిరిగాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆక్రోశంతో ఊగిపోతున్న రజనీష్ తన బావను కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారైయ్యాడు. తేరుకున్న కుటుంబసభ్యులు అంబరీష్ ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఇటీవలె ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని తమిళనాడులో టిక్ టాక్ యాప్ బాన్ చేయాలని అసెంబ్లీ సాక్షిగా ఓ అసెంబ్లీ మెంబర్ తీర్మానించారు.