టీడీపీ సభ్యుల ఆహ్వానాన్ని తిరస్కరించిన వంశీ..!

| Edited By: Srinu

Dec 09, 2019 | 1:56 PM

ఏపీ అసెంబ్లీలో.. వల్లభనేని వంశీ అయోమయానికి గురయ్యారు. టీడీపీకి రాజీనామా చేయడంతో.. ఆయన ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. అయితే.. టీడీఎల్పీ కార్యాలయంలోకి టీడీపీ ఎమ్మెల్సీలు.. వంశీని ఆహ్వానించారు. కానీ.. వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు వంశీ. కాగా.. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు వల్లభనేని వంశీ. అంతేకాకుండా.. పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. ఈరోజు అందరికీ షాక్‌ నిస్తూ.. వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలోని టీడీపీ నేతల వెనుక వంశీ […]

టీడీపీ సభ్యుల ఆహ్వానాన్ని తిరస్కరించిన వంశీ..!
Follow us on

ఏపీ అసెంబ్లీలో.. వల్లభనేని వంశీ అయోమయానికి గురయ్యారు. టీడీపీకి రాజీనామా చేయడంతో.. ఆయన ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. అయితే.. టీడీఎల్పీ కార్యాలయంలోకి టీడీపీ ఎమ్మెల్సీలు.. వంశీని ఆహ్వానించారు. కానీ.. వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు వంశీ. కాగా.. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు వల్లభనేని వంశీ. అంతేకాకుండా.. పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. ఈరోజు అందరికీ షాక్‌ నిస్తూ.. వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలోని టీడీపీ నేతల వెనుక వంశీ కూర్చొన్నారు. కాగా.. వైసీపీకి వెళ్లేందుకు రెడీగా ఉన్న వంశీపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది.. పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది.