Ponnam Prabhakar on Suramma Project : సూరమ్మ ప్రాజెక్ట్‎కు త్వరలో సంవత్సరీకం : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar on Suramma Project : జగిత్యాల జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు శిలాఫలకానికి త్వరలోనే సంవత్సరీకం..

Ponnam Prabhakar on Suramma Project :  సూరమ్మ ప్రాజెక్ట్‎కు త్వరలో సంవత్సరీకం : పొన్నం ప్రభాకర్
Ponnam

Updated on: Mar 22, 2021 | 4:29 PM

Ponnam Prabhakar on Suramma Project : జగిత్యాల జిల్లాలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు శిలాఫలకానికి త్వరలోనే సంవత్సరీకం చేస్తామని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని పొన్నం ఆరోపించారు. సూరమ్మ ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని జగిత్యాల జిల్లాలో పొన్నం పాదయాత్ర చేశారు.

పాదయాత్ర అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. పనిలోపనిగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై కూడా పొన్నం ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే జర్మనీలో ఉంటే ప్రజా సమస్యలు ఎవరు తీరుస్తారని పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also : Undavalli Arunkumar : భవిష్యత్‌లో ‘వాళ్ల’ గురించి మాట్లాడితే కాల్చి చంపేస్తారు, ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు