కూటమి అధికారంలోకి వస్తే.. రొటేషన్ ప్రధానులు.. అమిత్ షా ఎద్దేవా

| Edited By:

Apr 25, 2019 | 1:01 PM

బీహార్ ఎన్నికల ప్రచారంలో విపక్ష కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. మహాకూటమిలో సరైన నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే.. రోజుకు ఒక్కరు ప్రధానిగా వ్యవహరిస్తారని అన్నారు. సోమవారం మమత, మంగళ వారం అఖిలేష్, బుధవారం మాయావతి, గురువారం లాలూ ప్రసాద్, శుక్రవారం చంద్రబాబు, శనివారం దేవేగౌడ ప్రధానిగా వ్యవహరిస్తారని.. ఇక ఆదివారం దేశానికి హాలీడే అని సెటైర్లు వేశారు. కూటమిని సమర్థంగా నడిపే నాయకుడు లేనప్పటికీ రొటేషన్ పద్ధతిలో […]

కూటమి అధికారంలోకి వస్తే.. రొటేషన్ ప్రధానులు.. అమిత్ షా ఎద్దేవా
Follow us on

బీహార్ ఎన్నికల ప్రచారంలో విపక్ష కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. మహాకూటమిలో సరైన నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే.. రోజుకు ఒక్కరు ప్రధానిగా వ్యవహరిస్తారని అన్నారు.

సోమవారం మమత, మంగళ వారం అఖిలేష్, బుధవారం మాయావతి, గురువారం లాలూ ప్రసాద్, శుక్రవారం చంద్రబాబు, శనివారం దేవేగౌడ ప్రధానిగా వ్యవహరిస్తారని.. ఇక ఆదివారం దేశానికి హాలీడే అని సెటైర్లు వేశారు. కూటమిని సమర్థంగా నడిపే నాయకుడు లేనప్పటికీ రొటేషన్ పద్ధతిలో పీఎం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటున్నారని షా అన్నారు.