అమ్మ రోజా.. ఏమి ‘జబర్దస్త్’ టార్గెట్..?

జబర్దస్త్‌ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్‌ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్‌ రావడంతో మంత్రి పదవిపై ఆమె ఆశపడ్డారు. కానీ రాజకీయ లెక్కలు కలిసి రాలేదు. అయితే ఆమె టార్గెట్‌ మార్చారు? కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఏంటా లక్ష్యం ? నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా…ఏపీఐఐసీ ఛైర్మన్‌. వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ జిల్లాలో […]

అమ్మ రోజా.. ఏమి ‘జబర్దస్త్’ టార్గెట్..?
Follow us

|

Updated on: Nov 18, 2019 | 7:41 PM

జబర్దస్త్‌ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్‌ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్‌ రావడంతో మంత్రి పదవిపై ఆమె ఆశపడ్డారు. కానీ రాజకీయ లెక్కలు కలిసి రాలేదు. అయితే ఆమె టార్గెట్‌ మార్చారు? కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఏంటా లక్ష్యం ?

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా…ఏపీఐఐసీ ఛైర్మన్‌. వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ జిల్లాలో రాజకీయ సమీకరణాలు..ఇతర కారణాలతో ఆమెకు మంత్రి పదవి రాలేదు. దీంతో ఆమెను ఏపీఐఐసీకి ఛైర్మన్‌ చేశారు సీఎం జగన్‌. అయితే ఇప్పుడు రోజా సరికొత్త టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆమె ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతో గెలిచారు. చివరి వరకు ఆమె ఓడిపోతారనే ప్రచారం జరిగింది. కానీ చివరికి రెండు వేల బోటాబోటీ ఓట్లతో ఆమె గెలిచారు. రోజాకు నియోజకవర్గంపై పట్టు లేదనే విమర్శలు ఆమెపై అప్పట్లో వినిపించాయి. మెజార్టీ రాకపోవడంతో పాటు నగరిలో పరిస్థితులు ఆమెకు మంత్రి పదవికి దూరం చేశాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు రోజా ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌ అయిన తర్వాత రోజా దూకుడు పెంచారు. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలు చేపట్టారు.

గతంలో రోజా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా… టీవీ షోల మీద ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శలు వచ్చాయి. ఇకపై ఆ ముద్ర లేకుండా పూర్తిగా నియోజకవర్గానికి ప్రయారిటీ ఇవ్వాలని రోజా నిర్ణయించుకున్నారట. అందుకే ఇకపై కొత్త షోలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. కేవలం జబర్దస్త్ షోకే పరిమితం కావాలని రోజా నిర్ణయించుకున్నారట. కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు నగరిలోనే రోజా ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం కూడా చేశారు.

మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్‌ ఇప్పటికే హింట్‌ ఇచ్చారు. దీంతో విస్తరణలో బెర్త్‌ ఎలాగైనా సంపాదించాలనే లక్ష్యంతో రోజా ముందుకు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రోజా టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. మరీ అందులో విజయం సాధిస్తారో లేదో వేచిచూడాలి.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్