ఆ బాధలు మోదీకి తెలియవు.. : బీఎస్పీ అధినేత్రి

బహుజన్ సమాజ్ పార్టీ ఛీప్ మాయావతి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఎస్పీ – ఎస్పీ పొత్తు కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడాన్ని ఆమె తప్పుబట్టారు. తమది కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడం.. ఆయన అపరిపక్వతకు నిదర్శనమని.. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వెనుకబాటు తరగతుల బాధలు, నొప్పి మోదీకి తెలియదంటూ మండిపడ్డారు. ఆయన ఒకవేళ వెనుకబాటు కులంలో పుట్టి ఉంటే.. ఆర్‌ఎస్‌ఎస్ ఇవాళ ఆయనను ప్రధానిని చేసి ఉండేదికాదన్నారు. ఒక్కసారి మోదీ […]

ఆ బాధలు మోదీకి తెలియవు.. : బీఎస్పీ అధినేత్రి
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 3:31 PM

బహుజన్ సమాజ్ పార్టీ ఛీప్ మాయావతి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఎస్పీ – ఎస్పీ పొత్తు కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడాన్ని ఆమె తప్పుబట్టారు. తమది కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడం.. ఆయన అపరిపక్వతకు నిదర్శనమని.. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వెనుకబాటు తరగతుల బాధలు, నొప్పి మోదీకి తెలియదంటూ మండిపడ్డారు. ఆయన ఒకవేళ వెనుకబాటు కులంలో పుట్టి ఉంటే.. ఆర్‌ఎస్‌ఎస్ ఇవాళ ఆయనను ప్రధానిని చేసి ఉండేదికాదన్నారు. ఒక్కసారి మోదీ తన సొంత రాష్ట్రం వైపు చూస్తే.. అక్కడ దళితులపై జరుగుతున్న దాడుల గురించి తెలుస్తుందని.. గుజరాత్‌లో దళితులు గౌరవప్రదంగా జీవించలేకపోతున్నారని మాయావతి పేర్కొన్నారు.