కర్ణాటకలో ప్రభుత్వ పతనం.. యడ్యూరప్ప జోస్యం

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరో బాంబు పేల్చారు. ప్రభుత్వం పట్ల 20మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. వీరంతా ఏ క్షణంలోనైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని.. తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని చెప్పిన ఆయన, ఏం జరుగబోతుందో వేచి చూడాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని.. ఇందుకు మైసూర్‌లో జరిగిన దారుణ ఘటన నిదర్శనమని అన్నారు. కాగా కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి […]

కర్ణాటకలో ప్రభుత్వ పతనం.. యడ్యూరప్ప జోస్యం
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 5:00 PM

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరో బాంబు పేల్చారు. ప్రభుత్వం పట్ల 20మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. వీరంతా ఏ క్షణంలోనైనా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందని.. తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని చెప్పిన ఆయన, ఏం జరుగబోతుందో వేచి చూడాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని.. ఇందుకు మైసూర్‌లో జరిగిన దారుణ ఘటన నిదర్శనమని అన్నారు.

కాగా కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పలు ఎత్తుగడలు వేస్తోంది. అయితే తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ ఆ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తాజా వ్యాఖ్యలు కన్నడనాట సంచలనం రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ తేనెటీగల తుట్టెను లేపినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.