Watch Video: ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల.. ఎన్నికల వేళ తెరపైకి ఛార్జిషీట్ల అంశం..

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై కేసులు.. సీబీఐ ఛార్జిషీట్ల విషయంలో షర్మిల చేసిన ఆరోపణలపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల తన మీద నిరాధార ఆరోపణలు చేశారన్నారు పొన్నవోలు సుధాకర్. రాజకీయ లబ్ధి కోసం షర్మిల పచ్చి అబద్ధాలు ఆడారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉందన్నారు.

Watch Video: ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల.. ఎన్నికల వేళ తెరపైకి ఛార్జిషీట్ల అంశం..
Ap Politics
Follow us

|

Updated on: Apr 26, 2024 | 7:50 PM

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై కేసులు.. సీబీఐ ఛార్జిషీట్ల విషయంలో షర్మిల చేసిన ఆరోపణలపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ కౌంటర్ ఇచ్చారు. షర్మిల తన మీద నిరాధార ఆరోపణలు చేశారన్నారు పొన్నవోలు సుధాకర్. రాజకీయ లబ్ధి కోసం షర్మిల పచ్చి అబద్ధాలు ఆడారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. షర్మిల వ్యాఖ్యల్లో నిజం అంతే ఉందన్నారు. అన్యాయంగా వైఎస్‌ఆర్‌ పేరును మలినం చేస్తుంటే.. అడ్వొకేట్‌గా నా మనసు చెలించి అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చానన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్‌రావు హైకోర్ట్‌కు లెటర్ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏ తప్పూ చేయని రాజశేఖర్‌రెడ్డి మీద 2011లోనే ఆరోపణలు చేశారని తెలిపారు. 2011, ఆగస్ట్ 17 నాడే వైఎస్‌ఆర్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని చెప్పారు. డిసెంబర్ 2011న తాను ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగిందని ఆధారాలు చూపించారు. అప్పటికి జగన్ ఎవరో కూడా తనకు తెలీయదని చెప్పారు.

రక్తసంబంధం, బంధుత్వం లేకపోయినా తనంతట తానుగా కేసు వేశానని ఈ సందర్భంగా అన్నారు. రాజశేఖర్‌రెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం తప్పని తాను కేసు వేసినట్లు పొన్నవోలు సుధాకర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లలో ఇరికించిన ఆ ప్రతిఫలమే పొన్నవోలుకి AAG హోదా అని షర్మిల కీలక ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ చార్జ్ షీట్లో నమోదు చేయలేదన్నారు ఆమె. షర్మిల వ్యాఖ్యలపై పొన్నవోలు సుధాకర్ నిప్పులు చెరిగారు. తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారన్నారు. కేవలం తన టాలెంట్‌తోనే AAG హోదా దక్కించుకున్నానని బదులిచ్చారు. రాజకీయాలకు తనను బలిపశువును చెయ్యొద్దని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…