పాకిస్థాన్‌ను ఒక్క మాటంటే నేను పది తిడతా.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కుప్వామా : జమ్ముకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్ఫ్ పార్టీ నేత మహ్మద్ అక్బర్ లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను ఎవరైనా ఒక మాట తిడితే తాను తిరిగి వారిని పదిమాటలు తిడతానని అన్నారు. శనివారం కుప్వామాలో జరిగిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన పక్కన ముస్లీం దేశం ఉంది. భారతదేశం, పాకిస్తాన్ ఒకరితో మరొకరు స్నేహంగా కలిసి మెలిసి ఉండాలి. రెండు దేశాలు అత్యుత్తమ ప్రగతి సాధించాలి. వాటిని కాకుండా […]

పాకిస్థాన్‌ను ఒక్క మాటంటే నేను పది తిడతా.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Edited By:

Updated on: Mar 26, 2019 | 4:18 PM

కుప్వామా : జమ్ముకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్ఫ్ పార్టీ నేత మహ్మద్ అక్బర్ లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను ఎవరైనా ఒక మాట తిడితే తాను తిరిగి వారిని పదిమాటలు తిడతానని అన్నారు. శనివారం కుప్వామాలో జరిగిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మన పక్కన ముస్లీం దేశం ఉంది. భారతదేశం, పాకిస్తాన్ ఒకరితో మరొకరు స్నేహంగా కలిసి మెలిసి ఉండాలి. రెండు దేశాలు అత్యుత్తమ ప్రగతి సాధించాలి. వాటిని కాకుండా గొడవలు, యుద్ధాలు అంటూ పంతాలకు పోకూడదు. ఎవరైనా సరే పాకిస్తాన్‌ను ఒక్క మాటంటే.. వారిని నేను పది తిడతాను అని మహ్మద్ అక్బర్ అన్నారు.

కాగా మహ్మద్ అక్బర్ లోనే కుప్వామా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా అనేక సార్లు పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పాకిస్థాన్‌కు జై కొట్టిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలోనే పాకిస్తాన్‌ను మద్దతుగా నినాదాలు చేశాడు. అప్పట్లో దేశ వ్యాప్తంగా మహ్మద్ అక్బర్ లోనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి.