‘ మహా ‘ స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవికి తమ అభ్యర్థి అయిన కిషన్ కథోర్ ను బీజేపీ ఉపసంహరించుకుంది. దీంతో రేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే ఒక్కరే మిగిలారు. ఇక స్పీకర్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి శనివారం శాసనసభలో బల పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. 288 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో 169 మంది ఎమ్మెల్యేలు ఈ కూటమికి అనుకూలంగా ఓటు చేశారు. బీజేపీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంతో శివసేన […]

' మహా ' స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే
Follow us

|

Updated on: Dec 01, 2019 | 3:27 PM

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవికి తమ అభ్యర్థి అయిన కిషన్ కథోర్ ను బీజేపీ ఉపసంహరించుకుంది. దీంతో రేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే ఒక్కరే మిగిలారు. ఇక స్పీకర్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి శనివారం శాసనసభలో బల పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. 288 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో 169 మంది ఎమ్మెల్యేలు ఈ కూటమికి అనుకూలంగా ఓటు చేశారు. బీజేపీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంతో శివసేన అధినేత, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం సునాయాసంగా మెజారిటీని నిరూపించుకోగలిగింది. కాగా-56 ఏళ్ళ నానా పటోలే విదర్భ జిల్లాలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ నేతగా కొనసాగిన ఆయన ఆ పార్టీని వీడి బీజేపీ టికెట్ పై 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. అయితే ప్రధాని మోదీ తోను, మాజీ సీఎం ఫడ్నవీస్ తోను తలెత్తిన విభేదాల కారణంగా ఆయన 2017 లో బీజేపీని వీడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.