రాష్ట్ర బడ్జెట్ లో మూడో వంతు వారికోసమే.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి

|

Feb 05, 2021 | 1:36 PM

తెలంగాణ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో మూడో వంతు రైతుల కోసమే ఖర్చు చేస్తున్నామని హరీష్‌రావు..

రాష్ట్ర బడ్జెట్ లో మూడో వంతు వారికోసమే.. కీలక ప్రకటన చేసిన తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి
Follow us on

తెలంగాణ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో మూడో వంతు రైతుల కోసమే ఖర్చు చేస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడం వల్లే ఇది సాధ్యమవుతుందని అన్నారు. మెదక్‌ జిల్లాలో పర్యటించిన హరీశ్‌రావు.. రైతువేదికను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల చేయూతనిస్తూ, వ్యవసాయాన్ని పండగలా మార్చిందన్నారు. రాష్ట్రంలో 2500 రైతు వేదికలు నిర్మించామని చప్పారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా ఇబ్బందులు పడ్డారని హరీశ్‌రావు విమర్శించారు. గత పాలకులు ఘనపూర్ ఆనకట్ట నిర్మాణానికి రూపాయి ఖర్చుచేయలేదని, ఇరిగేషన్‌ మంత్రిగా తానే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. మరో 25 కోట్లతో ఘనపురం అనకట్టను అధునీకరిస్తామని ఆయన హామీనిచ్చారు.

సింగూరుకు రేపో మాపో కాళేశ్వరం కాలువ కలుస్తుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మెదక్ ప్రాంత రైతులకు రెండు పంటలకు నీళ్లు అందిస్తామని హామీనిచ్చారు. దసరాలోపు కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంత రైతుల కాళ్ళు తడుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. మంజీర మీద 14 చెక్ డ్యామ్‌లు కట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి పనులను కేవలం 7 ఏళ్లలో చేసి చూపించామన్నారు.

 

Read more:

ఈ నెల 7న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం భేటీ.. పలు కీలక అంశాలపై చర్చించనున్న సమావేశం

తెలంగాణలో నిరుద్యోగులకు శక్కర్ వార్త.. రాష్ట్ర బడ్జెట్ లో నిరుద్యోగ భృతి చేర్చే అవకాశం