టీడీపీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా

విజయవాడ: ప్రకాశం జిల్లా టీడీపీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. టీడీపీలో నన్ను బాగా చూసుకున్నారని, చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయని అన్నారు. వైఎస్‌తో కూడా తమకు మంచి సంబంధాలున్నాయని మాగుంట చెప్పారు. […]

టీడీపీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా

Updated on: Mar 14, 2019 | 5:29 PM

విజయవాడ: ప్రకాశం జిల్లా టీడీపీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు ఆయన పంపించారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

టీడీపీలో నన్ను బాగా చూసుకున్నారని, చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయని అన్నారు. వైఎస్‌తో కూడా తమకు మంచి సంబంధాలున్నాయని మాగుంట చెప్పారు. ఒంగోలుతో ఉన్న 30 ఏళ్ల అనుభవం కారణంగా ప్రకాశం జిల్లాలోనే పోటీ చేయడం తనకిష్టం అని అన్నారు.