PM Modi tour: ఈనెల 6, 8న రాష్ట్రానికి ప్రధాని మోదీ.. కూటమి తరపున ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఏపీలో కూటమి తరపున మరోసారి ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారని.. కూటమి ప్రధాని మోదీ ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.

PM Modi tour: ఈనెల 6, 8న రాష్ట్రానికి ప్రధాని మోదీ.. కూటమి తరపున ఎన్నికల ప్రచారం
Pm Modi
Follow us

|

Updated on: May 05, 2024 | 8:49 AM

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హెరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఏపీలో కూటమి తరపున మరోసారి ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటిస్తారని.. కూటమి ప్రధాని మోదీ ప్రచారం చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. మే 6వ తేదీన రాజమండ్రి, అనకాపల్లి సభల్లో.. మే 8న పీలేరు సభ, విజయవాడ రోడ్‌ షోలో మోదీ పాల్గొంటున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సభలను విజయవంతం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు.

ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ తో కలిసి వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. కూటమి అభ్యర్థులను విజయాన్ని కాంక్షిస్తూ సభలో ప్రసంగిస్తారు మోదీ. సభ అనంతరం సాయంత్రం 5గంటల 45 నిమిషాలకు పవన్‌, చంద్రబాబుతో కలిసి విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రధాని. అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ. పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ తో కలిసి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5గంటలకు విజయాడ చేరుకొని.. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకూ పవన్, చంద్రబాబుతో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతారు మోదీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..