Amit Shah Tour: అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యం.. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అత్యధిక లోక్‌సభ స్థానల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ముఖ్య నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు.

Amit Shah Tour: అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యం.. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
Amit Shah
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:59 AM

సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అత్యధిక లోక్‌సభ స్థానల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ముఖ్య నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనుంది బీజేపీ. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పట్టనున్నారు. తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఏఫ్రిల్ 25 అంటే… రేపు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు అమిత్‌ షా. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్‌ షా చేరుకుంటారు. అక్కడి నుంచి సిద్ధిపేటకు వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2 గంటల తర్వాత తిరిగి భువనేశ్వర్‌ వెళ్లనున్నారు అమిత్‌ షా. ఈ బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావుతో పాటు పలువురు నేతలు హజరవుతారు.

ఇక.. అమిత్‌ షా సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమిత్‌షా రాకతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత… అమిత్ షా తొలిసారి తెలంగాణ పర్యటనకు రానుండటంతో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. సభా ప్రాంగణాన్ని భారీ కటౌట్లతో నింపనున్నారు. అలాగే పెద్ద ఎత్తున జనసమీకరణకు బీజేపీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles