Nalgonda Politics: ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీ.. ఆసక్తికరంగా మారిన లోక్‌సభ ఎన్నికలు!

సాధారణంగా ఎన్నికల్లో పోటీ అంటేనే పార్టీల మధ్య ఉంటుంది. గెలుపు కోసం పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతారు. కానీ ఆ జిల్లాలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల వేళ ఇద్దరు మంత్రుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీగా ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఆ మంత్రులకు పార్లమెంటు ఎన్నికలు సవాల్ గా మారాయి.

Nalgonda Politics: ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీ.. ఆసక్తికరంగా మారిన లోక్‌సభ ఎన్నికలు!
Uttam Kumar Reddy, Komatireddy Venkat Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 27, 2024 | 10:32 AM

సాధారణంగా ఎన్నికల్లో పోటీ అంటేనే పార్టీల మధ్య ఉంటుంది. గెలుపు కోసం పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతారు. కానీ ఆ జిల్లాలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల వేళ ఇద్దరు మంత్రుల మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ పార్టీల మధ్య కంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీగా ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఆ మంత్రులకు పార్లమెంటు ఎన్నికలు సవాల్ గా మారాయి. ఆ టార్గెట్ కోసం మంత్రులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏదా జిల్లా.. ఎవరా మంత్రులు..? అయితే మంత్రుల మధ్య ఉన్న పోటీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ ఉద్దండులంతా ఈ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హేమ హేమీలైన సీనియర్ నేత జానారెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారే. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించి పూర్వవైభోవాన్ని చాటుకుంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగినా, నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ జయ కేతనం ఎగరవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా జిల్లా అగ్రనేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద కష్టమేమీ కాదు. కానీ నల్లగొండ, భువనగిరి స్థానాల్లో సాధించే మెజారిటీ పైనే కాంగ్రెస్ దృష్టి సారించింది. రెండు చోట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మూడు లక్షల మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి.. టార్గెట్ పెట్టగా, నాలుగు లక్షలతో గెలిపిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు. దేశంలో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీంతో రెండు పార్లమెంటు స్థానాల్లో సాధించే మెజారిటీపై ఇద్దరు మంత్రులు పోటీ పడుతున్నారు. రెండు స్థానాల్లో మెజార్టీ పైనే మంత్రులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురు కుంటున్నారు.

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం.. ఆది నుంచి కమ్యూనిస్టులు ఆ తర్వాత కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి ఇప్పటి వరకూ బీఆర్ఎస్ బోణీ చేయలేదు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ సన్నిహితుడు, సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డిని బరిలో నిలిపింది. బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్, కోదాడ, రఘువీర్ రెడ్డి సోదరుడు గెలిచిన నాగార్జునసాగర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన నల్లగొండ, సూర్యాపేట మినహా కాంగ్రెస్ గెలిచిన మిర్యాలగూడ, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే ఉన్నాయి. నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

రావి నారాయణరెడ్డి రికార్డు బ్రేక్ చేస్తారా..?

1952లో సార్వత్రిక ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డికి 2,72,280 మెజార్టీ వచ్చింది. ఈయన భువనగిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో దేశంలో తొలి ప్రధాని నెహ్రూకు కంటే రావి నారాయణరెడ్డికి వచ్చిన మెజార్టే ఎక్కువ. ఆ తర్వాత మళ్లీ 2009లో నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో గుత్తా సుఖేందర్రెడ్డికి 1,52,982 ఓట్ల మెజార్టీ రాగా, 2014 లో 1,93,156 ఓట్ల మెజార్టీ వచ్చింది. చాలెంజ్ గా తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించారు. మెజారిటీకి ఉత్తమ్ వ్యూహ రచనకు పదును పెడుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, అదే స్పీడ్ తో దేశంలోనే నల్గొండ పార్లమెంట్ లో భారీ మెజార్టీ సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మెజారిటీపై మంత్రుల సవాళ్లు ప్రతి సవాళ్లు..

ఇక భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వస్తే.. ఇక్కడి నుంచి సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. బిజెపి నుండి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుండి క్యామ మల్లేష్ బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు బ్రాండ్ ఇమేజ్ ఉంది. జిల్లాలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, భువనగిరి,ఆలేరు, తుంగతుర్తి లతోపాటు ఇబ్రహీంపట్నం, జనగామ నియోజక వర్గాల్లో కూడా బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా గెలుపోటములను శాంచించే సత్తా వీళ్లకుంది.

భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలిచారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో జనగామ మినగా మిగిలిన ఆరు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ గా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తామని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శపథం చేశారు. మాకు ఏ పార్టీతో పోటీ లేదని, మెజరిటీలో నల్లగొండ కాంగ్రెస్ తోనే పోటీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇక్కడి నుండి నాలుగు లక్షల మెజార్టీ సాధించాలని, ఆ బాధ్యత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పైనే ఉందని ఆయన అన్నారు.

ఇక్కడ పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కంటే నల్గొండ వర్సెస్ భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఇద్దరు మంత్రులకు రెండు స్థానాల్లో మెజారిటీ సవాల్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్