ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయంతో తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్నిర్వహించగా.. బుధవారం జరిగిన జీ23 నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్‌నేత గులామ్‌నబీ ఆజాద్ (Ghulam Nabi Azad)నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ బలోపేతంపై నేతలు తమ ప్రతిపాదనలు సూచించారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్‌నేత గులాం నబీ ఆజాద్.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో(SONIA GANDHI) గురువారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జీ23 నేతలు బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదించిన కొన్ని అంశాలను సోనియాకు వివరించనున్నారు ఆజాద్.
కాగ ఈ డిమాండ్లపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను, ప్రతిపాదనలను ఆజాద్ సోనియా గాంధీకి వివరించనున్నారు. అయితే గులాం నబీ ఆజాద్‌తో జరగనున్న భేటీలో సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉంటారని తెలుస్తోంది. ఈ సమావేశం పై కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఆజాద్నివాసంలో సమావేశమైన జీ23 నేతలు.. పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి స్థాయిలో సమష్టి, సమ్మిళిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దెదించాలంటే కాంగ్రెస్ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలతో అధిష్ఠానం చర్చలు జరిపి కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ బలోపేతానికి గల మార్గాలపై నేతలు చర్చించారు.
ఇవి కూడా చదవండి: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదు..